Loading...
Meta: రెస్టారెంట్లు, షాపింగ్ కూడా చేసే AI ఏజెంట్.. మెటా కొత్త ప్రయోగం..
రెస్టారెంట్లు, షాపింగ్ కూడా చేసే AI ఏజెంట్.. మెటా కొత్త ప్రయోగం..

Meta: రెస్టారెంట్లు, షాపింగ్ కూడా చేసే AI ఏజెంట్.. మెటా కొత్త ప్రయోగం..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా దిగ్గజం మెటా సరికొత్త వ్యక్తిగత AI ఏజెంట్‌ను పరీక్షిస్తోంది. 'ప్రాజెక్ట్ హ్యాచ్' (Project Hatch) పేరుతో రూపొందించిన ఈ టూల్‌ను ప్రస్తుతం మెటా ఉద్యోగులతో పరీక్షిస్తోంది. సాధారణంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే చాట్‌బాట్‌లకు భిన్నంగా.. ఈ AI ఏజెంట్ యూజర్ల తరఫున పలు ఆన్‌లైన్ పనులను కూడా పూర్తి చేయగలదు. రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేయడం, ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడం, చివరకు పెంపుడు కుక్కను చూసుకునే వ్యక్తిని (డాగ్ సిట్టర్) వెతకడం వంటి పనులను కూడా ఇది చేయగలదు. ప్రాజెక్ట్ హ్యాచ్‌కు సంబంధించిన వివరాలు మెటా అంతర్గత మెమో ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ మెమోను బిజినెస్ ఇన్‌సైడర్ సంపాదించింది.

వివరాలు

చాట్‌బాట్‌కు మించి.. ఎన్నో పనులు..

ప్రాజెక్ట్ హ్యాచ్ సాధారణ చాట్‌బాట్‌లా కాకుండా సొంత కంప్యూటర్‌తో పనిచేస్తుంది.

వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలతో నేరుగా ఇది ఇంటరాక్ట్ అవుతుంది.

అవసరమైన ఫారాలను నింపడం, కొనుగోళ్లు చేయడం, వివరంగా పరిశోధన చేయడం వంటి పనులను కూడా AI ఏజెంట్ నిర్వహించగలదు.

అంతేకాదు.. ఈమెయిల్, క్యాలెండర్, స్పాటిఫై, ఓపెన్‌టేబుల్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సేవలకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఏజెంట్‌ను మరింత వ్యక్తిగతీకరించుకునే అవకాశం కూడా ఉంది.

యూజర్ తమ AI ఏజెంట్‌కు ఒక పేరు పెట్టుకోవచ్చు. అలాగే ఏ రకమైన సమాచారంపై ఎక్కువ దృష్టి పెట్టాలో కూడా సూచించవచ్చు.

వివరాలు

జుకర్‌బర్గ్ ఆలోచనలకు అనుగుణంగానే..

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రతిపాదిస్తున్న వ్యక్తిగత AI ఏజెంట్ల విస్తృత ప్రణాళికలో భాగంగానే ప్రాజెక్ట్ హ్యాచ్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి ఒక్కరికీ 'పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్' అందించాలన్నదే మెటా లక్ష్యమని జుకర్‌బర్గ్ గతంలో పేర్కొన్నారు.

అయితే ప్రాజెక్ట్ హ్యాచ్‌కు సంబంధించిన ధర, అధికారికంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలను మెటా ఇంకా వెల్లడించలేదు.

గతంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇది వినియోగదారుల కోసం చెల్లింపు సేవగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నెలకు గరిష్ఠంగా 200 డాలర్ల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు

AIపై మరింత దృష్టి పెట్టేందుకు మెటా ప్రణాళిక..

ఈ ఏడాది ప్రారంభంలో జుకర్‌బర్గ్‌తో పాటు సంస్థలోని ఇతర ఉన్నతాధికారులు 'ప్రాజెక్ట్ OT' పేరుతో ఓ రీస్ట్రక్చరింగ్ ప్రణాళికను రూపొందించారు.

ఈ ప్రణాళికలో కొన్ని టీమ్‌లలో ఉద్యోగుల సంఖ్యను 60 శాతం వరకు తగ్గించి, AI టూల్స్, AI ఏజెంట్లను ఉపయోగించే చిన్న చిన్న ఉద్యోగుల బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

అయితే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, AI ఏజెంట్ల ద్వారా ఆశించిన స్థాయిలో ఉత్పాదకత పెరుగుతుందా అనే సందేహాలు వ్యక్తం కావడంతో.. మేలో సంస్థ 10 శాతం ఉద్యోగుల తగ్గింపును మాత్రమే అమలు చేసింది.

ఆ తర్వాత ఏడాది చివర్లో చేపట్టాలని భావించిన రెండో దశ ఉద్యోగుల తొలగింపు ప్రణాళికను మెటా రద్దు చేసింది.

ADVERTISEMENT