Page Loader
GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది

GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 03, 2023
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది. ChatGPT రాకతో AI రేసులో OpenAI ముందంజలో ఉంది. అందుకే మైక్రోసాఫ్ట్ ఇటీవల కొన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీతో ఒప్పందాన్ని కూర్చుకుంది. OpenAI కృతిమ మేధస్సు సామర్థ్యంతో ఆ సంస్థ అన్ని ఉత్పత్తులను కనెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే AI సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్న గూగుల్ వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తుంది. Teams ప్రీమియంకు అత్యంత ముఖ్యమైన ఫీచర్స్ లో ఒకటి ఇంటెలిజెంట్ రీక్యాప్ ఎవరైనా మీటింగ్స్ అటెండ్ కాలేకపోయినా GPT-3.5 మీటింగ్ నోట్స్, చేయాల్సిన టాస్క్‌లు, వ్యక్తిగత హైలైట్‌లను ఇస్తుంది.

మైక్రోసాఫ్ట్

మరి కొన్ని ఫీచర్లు 2023 రెండవ త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయి

ఇంటెలిజెంట్ రీక్యాప్ మీటింగ్ విభాగాలుగా విభజిస్తుంది. ఎవరైనా మీటింగ్‌లో చేరినప్పుడు/నిష్క్రమించినప్పుడు ఆ టైమ్‌లైన్ ను చూపిస్తుంది. మరికొన్ని ఫీచర్లు 2023 రెండవ త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. టీమ్స్ ప్రీమియం 40 భాషలకు రియల్ టైమ్ AIతో ప్రత్యక్ష ట్రాన్సలేషన్ చేయగలదు. ఈ ఫీచర్‌ని మీటింగ్ ఆర్గనైజర్‌కు మాత్రమే పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెంట్ రీక్యాప్‌కు స్పీకర్ టైమ్‌లైన్ మార్కర్‌లను కలపాలని కూడా ఆలోచిస్తుంది. మీటింగ్‌లో ఎవరు మాట్లాడారో, ఎప్పుడు మాట్లాడారో అది చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ Teams ప్రీమియం నెలకు $7 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుంది. ఆ తర్వాత, నెలకు $10 వసూలు చేయాలని సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలిపింది.