Page Loader
నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్
నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 02, 2023
09:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

OpenAI సంస్థ ChatGPT చుట్టూ ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించి, మనుషుల లాగే మాట్లాడే సామర్థ్యం ఉన్న చాట్‌బాట్ కోసం కంపెనీ కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. దీనికి ChatGPT ప్లస్ అని పేరుపెట్టింది, అయితే ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వలన ఉచిత సేవకు ఎటువంటి ఆటంకం ఉండదని ఆ సంస్థ తెలిపింది. ChatGPTలో ప్రస్తుతం మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, ఆ సంస్థ యూజర్ బేస్‌ను మోనటైజ్ చేసే పనిలో ఉంది.

ప్లాన్

జనవరిలో ChatGPT చెల్లింపు విధానం ప్రివ్యూ చూపించిన OpenAI

OpenAI 2023లో $200 మిలియన్లను ఆర్జించే అవకాశం ఉన్నా ఇందులో పెట్టిన పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటే అది చాలా తక్కువ. ప్రస్తుతం USలోని కస్టమర్‌లకు మాత్రమే ChatGPT ప్లస్‌కి యాక్సెస్ ఉంది. OpenAI త్వరలోనే ఈ చెల్లింపు ప్లాన్ ఇతర దేశాలకు అందుబాటులోకి తీసుకురానుంది. జనవరిలో ChatGPT చెల్లింపు విధానం ప్రివ్యూ చూపించింది OpenAI. అప్పుడే చాట్‌బాట్ ని మరింత సమర్ధవంతంగా తయారుచేయడానికి డబ్బు ఆర్జించడం ఒక మార్గం అని తెలిపింది.ChatGPT ప్లస్ సబ్స్క్రిప్షన్ ధర నెలకు $42 అని మొదట బయటికి వచ్చిన సమాచారం తప్పని ChatGPT ప్లస్ ధర నెలకు $20 అని కంపెనీ ప్రకటించడం వలన తెలిసింది.