ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ జర్నలిస్టులు, క్రియేటర్ల సమక్షంలో కొత్త Bing గురించి ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య AI రంగంలో పోటీ రసవత్తరంగా మారింది. Bardను ChatGPTకి సమాధానంగా గూగుల్ ప్రకటించింది. గూగుల్ ఈవెంట్ ఫిబ్రవరి 8న షెడ్యూల్ చేయడం వలన, మైక్రోసాఫ్ట్ ఒక రోజు ముందుగానే తమ కార్యక్రమాన్ని నిర్వహించింది. కొత్త Bing గరిష్టంగా 1,000 అక్షరాలను తీసుకోగలదు. ఇది ChatGPT కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఏదైనా సెర్చ్ చేసినప్పుడుప్రశ్నకు సమాధానంతో పాటు మాములు సెర్చ్ ఇంజిన్ ఫలితాలు కూడా వస్తాయి. ఇందులో కేవలం సెర్చ్ చేయడం మాత్రమే కాదు, దానితో చాట్ కూడా చేయవచ్చు. Bing చాట్ ChatGPTలా ఉంటుంది, ఈ చాట్ ఇంటర్‌ఫేస్‌లో, లింక్‌లు ఉండవు.
100 భాషల్లోకి అనువదించగల కొత్త Bing
ChatGPT లాగా, Bing చాట్ పర్యటన కోసం ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేయడం నుండి ఆ ప్రయాణ సారాంశాన్ని సృష్టించడం, ఇమెయిల్ పంపడం వరకు ఏదైనా చేయగలదు. ఇది 100 భాషల్లోకి అనువదించగలదు. కొత్త Bing Edge బ్రౌజర్‌లో కూడా అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ సైడ్‌బార్‌గా అందుబాటులో ఉన్న Bing చాట్‌తో ఎడ్జ్ కోసం కొత్త యూజర్ ఇంటర్ఫేస్ ని ప్రదర్శించింది. మైక్రోసాఫ్ట్ కొత్త Bing ఇంటర్‌ఫేస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇది నేటి నుండి డెస్క్‌టాప్‌లలో అందుబాటులో ఉంటుంది. పరిమిత సంఖ్యలో ప్రశ్నలకు సమాధానమిస్తుంది. అయినప్పటికీ, పూర్తి యాక్సెస్ కోసం కూడా సైన్ అప్ చేయాలి. కొత్త బింగ్ త్వరలో మొబైల్‌కు అందుబాటులోకి వస్తున్నాడని కంపెనీ తెలిపింది.