Page Loader
Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్
Bingలో ChatGPT AI కొత్త ఫీచర్

Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 05, 2023
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం బ్లాగ్ పోస్ట్‌లో OpenAI, DALL-E 2 నుండి ఇమేజ్-జెనరేషన్ సాఫ్ట్‌వేర్‌ను Bingకి అనుసంధానించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. చాట్‌బాట్ ChatGPTను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి తన సెర్చ్ ఇంజిన్ బింగ్ వెర్షన్‌ను ప్రారంభించే పనిలో పడింది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. మార్చి నెలాఖరులోపు కొత్త ఫీచర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పుడు అత్యధికులు వాడుతున్న గూగుల్‌ సెర్చ్ ఇంజిన్ ను సవాలు చేయాలని భావిస్తోంది మైక్రోసాఫ్ట్. చాలా నెలల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ OpenAI-చాట్‌బాట్ ChatGPTని ప్రారంభించింది. SEO లు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ వారికి కావాల్సిన సమాధానాలు పొందడానికి, వ్యాసాలు రాయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. కొందరు ChatGPTని గూగుల్ కిల్లర్‌గా పిలిచారు.

మైక్రోసాఫ్ట్

మనిషి లాగే మాట్లాడే ChatGPT

మైక్రోసాఫ్ట్ 2019లో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ OpenAIకి సపోర్ట్ ఇచ్చి, $1 బిలియన్ల నిధులను అందించింది. మైక్రోసాఫ్ట్ Azure క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్‌లో కృత్రిమ మేధస్సు సూపర్‌కంప్యూటింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఈ రెండు సంస్థలు కొన్ని సంవత్సరాల భాగస్వామ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. OpenAI సరికొత్త సృష్టి ChatGPT చాట్‌బాట్‌ను నవంబర్ 30న ఉచిత పబ్లిక్ టెస్టింగ్‌కు అందుబాటులోకి తెచ్చింది. చాట్‌బాట్ అనేది వినియోగదారు ప్రాంప్ట్‌ల ఆధారంగా మనుషుల తరహా సంభాషణను అనుకరించడానికి రూపొందించబడిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, ఇది మనుషులను మాట్లాడే శైలిని అనుకరిస్తూ ప్రశ్నలకు ప్రతిస్పందించగలదు. అయితే గూగుల్ దగ్గర చాలా అధునాతన AI, మెషిన్ లెర్నింగ్‌ ఉంది, ఇది ChatGPT చేసే పనిని మెరుగ్గా చేయగలదు.