ChatGPT: ప్రతి వారం చాట్‌జీపీటీలో 1 మిలియన్ వినియోగదారులు ఆత్మహత్య గురించి చర్చిస్తున్నారు: ఓపెన్ఏఐ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారం దాదాపు పదిలక్షల మందికి పైగా చాట్‌జీపీటీ వినియోగదారులు, చాట్‌లో ఆత్మహత్యకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు లేదా ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారని ఓపెన్ఏఐ వెల్లడించింది. సోమవారం ప్రచురించిన బ్లాగ్‌లో ఈ వివరాలు వెల్లడించాయి. సున్నితమైన సంభాషణల నిర్వహణపై తమ తాజా అప్‌డేట్‌లో భాగంగా ఈ అంశాన్ని కంపెనీ వెల్లడించింది. అంతేకాక, ప్రతీ వారం చురుకుగా ఉన్న వినియోగదారులలో 0.07 శాతం మంది (దాదాపు 5.6 లక్షల మంది) మానసిక సమస్యలు, ముఖ్యంగా మానియా లేదా మానసిక భ్రాంతులకు సంబంధించిన లక్షణాలు చూపుతున్నారని కూడా OpenAI తెలిపింది. అయితే ఇవి గుర్తించడం, కొలవడం చాలా క్లిష్టమని సంస్థ పేర్కొంది.
వివరాలు
170మంది వైద్య నిపుణులతో పరిశోధన
ఇటీవలి కాలంలో, ChatGPT వాడకంతో మానసిక సమస్యలు పెరుగుతున్నాయన్న విమర్శల నడుమ, ఒక టీనేజ్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న కేసులో కుటుంబం వేసిన కేసు తర్వాత OpenAIపై మరింత పర్యవేక్షణ పెరిగింది. అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)కూడా ఈ విషయంపై విచారణ ప్రారంభించింది. OpenAI తన తాజా GPT-5అప్‌డేట్ ద్వారా వినియోగదారుల భద్రతను మెరుగుపర్చినట్లు తెలిపింది. కొత్త మోడల్‌లో ఆత్మహానికీ, ఆత్మహత్యకూ సంబంధించిన 1,000కిపైగా సంభాషణలను పరిశీలించి, మునుపటి వెర్షన్‌తో పోలిస్తే 91శాతం సానుకూల ప్రతిస్పందన ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇక GPT-5లో క్రైసిస్ హాట్‌లైన్ నంబర్లు,వినియోగదారులు విశ్రాంతి తీసుకోవాలని గుర్తింపులు వంటి కొత్త ఫీచర్లు చేర్చినట్లు తెలిపింది. అలాగే 170మంది వైద్య నిపుణులతో కలిసి ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపింది.
వివరాలు
ChatGPTలో చాలా నియంత్రణలు
OpenAI ప్రకారం,మానసిక ఆరోగ్య సమస్యలు మానవ సమాజంలో ఎప్పటినుంచో ఉన్నవే. ChatGPT వినియోగదారుల సంఖ్య పెరిగిన కారణంగా, ఆ సమస్యలతో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఈ ప్లాట్‌ఫారంలో కనిపిస్తున్నారని పేర్కొంది. ఇక OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తాజాగా, మానసిక ఆరోగ్య పరంగా సంస్థ కొన్ని పురోగతులు సాధించిందని, అందువల్ల కొన్నిమేర నియంత్రణలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. "మునుపు మేము ChatGPTలో చాలా నియంత్రణలు పెట్టాం,కానీ ఇప్పుడు మానసిక ఆరోగ్య సమస్యలను మెరుగ్గా నియంత్రించే సాధనాలు సిద్ధమయ్యాయి," అని ఆల్ట్‌మన్ సోషల్ మీడియాలో తెలిపారు.
వివరాలు
హెల్ప్‌లైన్ వివరాలు
అమెరికాలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు 988 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా 988lifeline.org ద్వారా చాట్ చేయవచ్చు. యూకే, ఐర్లాండ్‌లో Samaritans సేవలు 116 123 నంబర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో Lifeline సేవ 13 11 14 నంబర్ ద్వారా సహాయం అందిస్తుంది. ఇతర దేశాల హెల్ప్‌లైన్ వివరాలు befrienders.orgలో లభిస్తాయి.