Moto RAZR 40 v/s RAZR 40 అల్ట్రా : ఈ రెండు డివైజ్‌ల ధర, ఫీచర్ల వివరాలిలా!
ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులను అకర్షించేలా మోటోరోలా కంపెనీ ఫోల్డ్ బుల్ ఫోన్లను లాంచ్ చేసింది. వాటిల్లో మోటోరోలా RAZR 40, మోటోరోలా RAZR 40 ఆల్ట్రా ఫోన్లు కస్టమర్లను వీపరితంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉన్న మొబైల్స్ కంటే భిన్నంగా ఉండనున్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం RAZR 40 డిజైన్ పరంగా Galaxy Z Flip4 లాగా ఉంటుంది. అయితే, RAZR 40 అల్ట్రా పెద్ద కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అల్ట్రా మోడల్ స్టాండర్డ్ వేరియంట్ కంటే సన్నగా , తేలికగా ఉంటుంది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో కొత్త ఫీచర్లు
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 6.9-అంగుళాల ఫుల్-HD+ 10-బిట్ LTPO పోల్డ్ మెయిన్ డిస్‌ప్లే, 413ppi పిక్సెల్ డెన్సిటీ, 1,400-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉన్నాయి. RAZR 40 ఫోన్ 60Hz 1.5-అంగుళాల 8-బిట్ OLED డిస్‌ప్లే, 1,000 బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. RAZR 40 అల్ట్రా 144Hz 3.6-అంగుళాల 10-బిట్ పోలెడ్ స్క్రీన్‌ను 1,100-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు పలువురు టెక్ నిపుణులు పేర్కొన్నారు. RAZR 40 8GB/128GB మోడల్ ధర రూ.46,550 ఉండగా.. RAZR 40 అల్ట్రా 8GB/256GB మోడల్ ధర రూ. 66,300 ఉండనుంది.