Motorola Edge 40 v/s Realme 11 Pro+.. ఇందులో బెస్ట్ ఫోన్ ఇదే!
మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ తొలి ఓపెన్ సేల్‌కు రెడీ అయింది. గతవారం లాంచ్ అయిన ఈ ఫోన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ సిమ్ సపోర్టు, వాటర్ రెసిస్టెన్స్, వైర్లెస్ చార్జింగ్ సపోర్టు ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ముందుకొచ్చింది. ఈ మొబైల్ ఫోన్ కు గట్టి పోటీగా రియల్ మీ 11 ప్రో ప్లస్ వచ్చింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో ఏ మొబైల్ కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 11 ప్రో+లో వెనుక వైపు ఆకర్షణీయమైన డీజన్ రానుంది. Motorola Edge 40లో 144Hz పోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
మోటోరోలాలో అత్యాధునిక ఫీచర్లు
Realme 11 Pro+ 6.7-అంగుళాల Full-HD+ 10-bit AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది, ఎడ్జ్ 40, 11 ప్రో+ కంటే వేగవంతమైన రిఫ్రెష్ రేట్ (144Hz v/s 120Hz)తో ముందుకొచ్చింది. ఫ్రో ప్లస్ లో 200MP ప్రధాన కెమెరా ఎంతో అకట్టుకుంటోంది. మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే.. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 13మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 13మెగాపిక్సెల్ కెమెరాలో మ్యాక్రో ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 ఉండనుంది. రియల్ మీ ప్రో ప్లస్ ధర 24,999 గా ఉండనుంది.