Page Loader
మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు!
సరికొత్త ఫీచర్స్ తో ముందుకు రానున్న మోటోరోలా నూతన స్మార్ట్ ఫోన్

మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 27, 2023
08:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోటోరోలా కంపెనీ తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మోటోరోలా RAZR 40 సరికొత్త సిరీస్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెటట్టనుంది. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు కూడా వీటిని కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా Motorola RAZR 40 స్మార్ట్ ఫోన్ జూన్ 1న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మూడు కలర్లలో అందుబాటులో ఉండనుంది. ఈఫోన్ బయటివైపు అధిక స్థలంలో కూడిన పెద్ద డిస్ ప్లేను కలిగి ఉంది. 2022లో వచ్చిన రాజఆర్ మోడల్ కన్నా కొద్దిగా పెద్దగా ఉండడం గమనార్హం.

Details

అత్యాధునిక ఫీచర్లో రానున్న మోటోరోలా   RAZR 40 

ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ తో ముందుకు రానుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని బరువు 189 గ్రాములు ఉండనుంది. ఈ ఫోన్ 3,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో 8GB ర్యామ్, 256GB ఉండనుంది. Motorola RAZR 40 Ultra ధర సూమారుగా రూ. 1,03,700, 1,06,400 మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచ్ సమయంలో దీని ధరపై క్లారిటీ రానుంది. సెల్ఫీ కోసం ప్రత్యేకంగా 32MP కెమెరా ఉండనుంది.