Page Loader
అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఇన్‍బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్‍టాప్.. రేపే లాంచ్
రేపు లాంచ్ కానున్న ఇన్ బుక్ ఎక్స్2 ల్యాప్ టాప్

అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఇన్‍బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్‍టాప్.. రేపే లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2023
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్ఫినిక్స్ నుంచి మరో ల్యాప్ టాప్ లాంచ్ కానుంది. సరికొత్త ఫీచర్లతో ఇన్బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్ టాప్ ను రేపు లాంచ్ చేయనున్నారు. భారత మార్కెట్లోకి ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ బ్రాండ్ స్పష్టం చేసింది. ఇందులో థిన్ డిజైన్ తో తేలికగా ఉంటూ సరికొత్త ఫీచర్లతో రానుంది. ఇప్పటికే ఈ ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్ 2 స్లిమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. 14.8 మిల్లీమీటర్ల మందంతో అల్ట్రా థిన్‌గా, 1.24 కేజీల బరువుతో అల్ట్రా లైట్‌గా, అతి తక్కువ బెజిల్స్‌తో ఈ ల్యాప్ టాప్ ను తీసుకొస్తున్నట్లు ఇన్ఫినిక్స్ పేర్కొంది. అదే విధంగా నాలుగు వైబ్రెంట్ కలర్ ఆఫ్షన్లు అందుబాటులోకి రావొచ్చు.

Details

50 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ రానున్న ల్యాప్ టాప్

ఐపీఎస్ ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేతో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్ 2 స్లిమ్ ల్యాప్‌టాప్ ముందుకొచ్చింది. 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్ వేరియంట్లతో ఈ ల్యాప్‌టాప్ రానుంది. టూ లేయర్ స్టిరియో స్పీకర్, ఐస్ స్టామ్ 10 కూలింగ్ సిస్టమ్, డ్యుయల్ స్టార్ లైట్ కెమెరా, బ్యాక్ లిట్ కీబోర్డు ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్ వస్తున్నట్లు సమాచారం. 50డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండనుంది. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్ 2 స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ రూ.30వేల లోపు ఉండనుంది. ఇంటెల్ కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్ వేరియంట్ ధర కాస్త ఎక్కువగా ఉండనుంది.