Page Loader
ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్తగా ఏమి యాడ్ చేశారంటే!
జూన్ 5న భారీ ఈవెంట్

ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్తగా ఏమి యాడ్ చేశారంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2023
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొత్త సిరీస్ లో దిమ్మతిరిగే కెమెరా ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లో లాంచ్ చేసేందుకు యాపిల్ కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. ఈ సందర్భంగా ఈ ఫోన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీకయ్యాయి. గతేడాది ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో అధిక జూమ్ అవుట్‌పుట్‌ను అనుమతించే పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఫోన్ లో MacBook Air 15-అంగుళాల స్క్రీన్‌తో రానుంది. ఈ ఫీచర్ వినియోగదారులను ఎంతో ఆకర్షించనుంది.

Details

భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్న యాపిల్ కంపెనీ

మాక్‌బుక్ ఎయిర్‌లోని పాత చిప్‌సెట్‌లో ఈ సామర్ధ్యం లేనందున, వినియోగదారులు ఖరీదైన మాక్‌బుక్ ప్రోని ఎంచుకోవలసి ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ స్పష్టం చేసింది. ఇంకా, డిస్ప్లే టెక్నాలజీ పరంగా, Apple మైక్రోLED డిస్ప్లేలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. Samsung డిస్ ప్లే నుండి ఉత్పత్తిని, దాని స్వంత తయారీ ప్లాంట్లకు మార్చాలని యోచిస్తోంది. మ్యాక్‌లలో అప్‌డేట్‌లను చెక్ చేసేందుకు అదే ప్రాసెస్ ఉంటుంది. ఆపిల్ జూన్ 5న జరగబోయే WWDC 2023లో ఈవెంట్లో మరెన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది.