Page Loader
2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4
ఐఫోన్ SE 4 కోసం ప్యానెల్ షిప్‌మెంట్‌లు 20 మిలియన్లు

2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 07, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాల్గవ తరం SE మోడల్‌కు BOE-తయారీ చేసిన OLED ప్యానెల్ లభిస్తుందని ELEC పేర్కొంది. నాల్గవ-తరం SE కోసం BOE-తయారీ చేసిన OLED ప్యానెల్ ధర సుమారు $40 (దాదాపు రూ. 3,300). రాబోయే ఐఫోన్15 సిరీస్‌లో ఉపయోగించే దానితో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. చౌకైన డిస్‌ప్లే ప్యానెల్‌ని ఉపయోగించడంతో ,ఆపిల్ ఐఫోన్ SE 4 కొంచెం తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుంది. ఐఫోన్ SE 4, సెల్ఫీ ఫేస్ ID సెన్సార్‌లతో ఐఫోన్ 14 డిజైన్‌ తో రూపొందింది. ఐఫోన్ 15 సిరీస్ రాబోయే iPadలలో చూసే సామ్ సంగ్/LG డిస్‌ప్లేలకు బదులుగా చైనా-ఆధారిత BOE ద్వారా సరఫరా అయిన 6.1-అంగుళాల OLED స్క్రీన్‌ తో వస్తుంది.

ఐఫోన్

ఐఫోన్ SE 4 కోసం ప్యానెల్ షిప్‌మెంట్‌లు 20 మిలియన్లు

డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్, LTPS టెక్నాలజీని పొందే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్ 13/14 మోడల్‌ల నుండి OLEDని కూడా ఉపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. ఐఫోన్ SE 4 కోసం ప్యానెల్ షిప్‌మెంట్‌లు 2024లో దాదాపు 20 మిలియన్ యూనిట్లు కావచ్చు. ఐఫోన్ 15 సిరీస్ OLEDల మొదటి బ్యాచ్ జూన్‌లో ప్రారంభమయ్యి సామ్ సంగ్/LG డిస్‌ప్లే ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఐఫోన్ SE 4 ఆపిల్ అంతర్గత 5G బేస్‌బ్యాండ్ చిప్‌ తో వస్తుంది. OLED ప్యానెల్‌తో పాటు, ఫోన్ 12MP ఫ్రంట్, రియర్ కెమెరాలు, 5G బేస్‌బ్యాండ్ చిప్, A16 బయోనిక్ ప్రాసెసర్‌తో వస్తుంది.