MWC 2023లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ అవార్డును అందుకున్న ఆపిల్ ఐఫోన్ 14 Pro
MWC 2023లో GSMA గ్లోబల్ మొబైల్ (GLOMO) అవార్డుల విజేతలను ప్రకటించింది. ఫిబ్రవరి 27-మార్చి 2 వరకు జరిగిన GLOMO అవార్డుల వేడుకలో డివైజ్ విభాగంలో నాలుగు అవార్డులు ఉన్నాయి, వాటిలో "ఉత్తమ స్మార్ట్‌ఫోన్", "డిస్రప్టివ్ డివైస్ ఇన్నోవేషన్" అవార్డులను ఆపిల్ సంస్థ గెలుచుకుంది. మిగిలిన రెండు అవార్డులు TCL మొబైల్, మోటరోలాకు దక్కాయి. GLOMO అవార్డులు స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. ఒక బ్రాండ్ గెలిస్తే లేదా GLOMO అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ అయినా సరే ఆ బ్రాండ్ కు తగిన గౌరవం లభిస్తుంది. ఈ అవార్డు బ్రాండ్‌కు గ్లోబల్ గుర్తింపును ఇస్తుంది, అమ్మకాల పెరుగుదలకు కూడా కారణమవుతుంది.
శాటిలైట్ ద్వారా ఆపిల్ ఎమర్జెన్సీ SOS ఫీచర్ కు "డిస్రప్టివ్ డివైస్ ఇన్నోవేషన్" అవార్డు దక్కింది
ఆపిల్ అందుకున్న "ఉత్తమ స్మార్ట్‌ఫోన్" అవార్డు కోసం 2022 జనవరి-డిసెంబర్ మధ్య స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను నిశితంగా విశ్లేషించి విజేతను ఎంపిక చేశారు. ఈ విభాగంలో Pixel 7 Pro, నథింగ్ ఫోన్ (1), Galaxy Z Flip4, Galaxy S22 Ultra ఆపిల్ తో పోటీపడ్డాయి . "డిస్రప్టివ్ డివైస్ ఇన్నోవేషన్" అవార్డు శాటిలైట్ ఆపిల్ ఎమర్జెన్సీ SOSకి అందించారు-ఈ ఫీచర్ వినియోగదారులు సెల్యులార్, Wi-Fi కవరేజీలో లేనప్పుడు అత్యవసర సేవలకు టెక్స్ట్‌లను పంపడంలో సహాయపడుతుంది. ఎమర్జెన్సీ సర్వీస్‌లతో కనెక్ట్ అవ్వడానికి వేరే ఆప్షన్ లేనప్పుడు శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS ఉపయోగపడుతుంది. ఫైండ్ మై యాప్‌ని ఉపయోగించి వ్యక్తులు తమ లొకేషన్‌ను షేర్ చేసుకోవడానికి కూడా ఇది సహాయం చేస్తుంది.