బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) అనేది GSMA నిర్వహిస్తున్న వార్షిక వాణిజ్య ప్రదర్శన. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కనెక్టివిటీ ఈవెంట్. ఇది బార్సిలోనాలో సాధారణంగా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యి మార్చి వరకు కొనసాగుతుంది. గ్లోబల్ బ్రాండ్‌లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, ప్రభుత్వ సంస్థలు తమ అత్యుత్తమ గాడ్జెట్స్ ను ప్రదర్శించడానికి ఈ వేడుకలో సమావేశమవుతారు.
ఈ ఈవెంట్ లో HONOR Magic5 సిరీస్, Vs ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తోంది
Samsung Galaxy S23 సిరీస్ ను ప్రదర్శించవచ్చు. సామ్ సంగ్ MWC 2023 15:00-16:30 CET (7:30-9:00 pm IST)కి "సామ్ సంగ్ మొబైల్ బిజినెస్ సమ్మిట్"తో సిద్ధంగా ఉంది. ఈ ఈవెంట్ లో HONOR Magic5 సిరీస్, Vs ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. Magic5 సిరీస్ సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ తో పోటీపడుతుంది, Huawei తన "న్యూ వాల్యూ టుగెదర్" సెషన్ 10:00-17:30 CET (2:30-10 pm IST)కి ప్రారంభామవుతుంది. డిజిటల్ విద్య, ప్రజా సేవలను ప్రోత్సహించే మార్గాల గురించి చర్చిస్తుంది. ఈ సెషన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, అటానమస్ ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తక్కువ-కార్బన్ డెవలప్‌మెంట్‌పై కూడా దృష్టి పెడుతుంది.