Page Loader
IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న  LG
టాటూ ప్రింటర్‌ వాడటానికి మొబైల్ యాప్‌కి కనెక్ట్ చేయాలి

IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 25, 2023
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

LG హౌస్‌హోల్డ్ & హెల్త్ కేర్ IMPRINTU అనే పోర్టబుల్ తాత్కాలిక టాటూ ప్రింటర్‌ను ప్రకటించింది. ఈ ప్రింటింగ్ మెషీన్ చర్మం, దుస్తులపై ముద్రించడానికి "సురక్షితమైన, కాస్మెటిక్-గ్రేడ్" టాటూ ఇంక్‌ను ఉపయోగిస్తుంది. ఈ టాటూలు సుమారు ఒక రోజు వరకు ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన LG హౌస్‌హోల్డ్ & హెల్త్ కేర్ ప్రముఖ బ్యూటీ కంపెనీలలో ఒకటి. IMPRINTU LG H&Hకి ఒక ముఖ్యమైన ప్రాడక్ట్. దాని సమర్థవంతమైన ప్రింటింగ్, విభిన్న డిజైన్ ఆప్షన్స్ తో తాత్కాలిక టాటూ మార్కెట్‌కు సరికొత్త ప్రాడక్ట్ అందించింది. ఈ కొత్త టాటూ ప్రింటర్‌తో ఫ్యాషన్ పరిశ్రమలో అగ్రగామిగా నిలవాలని కంపెనీ భావిస్తోంది. ఈ మెషిన్ 600dpi రిజల్యూషన్‌ తో ఒకే చేతితో ఉపయోగించడానికి సరిపోతుంది.

ఫోన్

ఈ టాటూ ప్రింటర్‌ని ఉపయోగించడానికి మొబైల్ యాప్‌కి కనెక్ట్ చేయాలి

ఈ టాటూ ప్రింటర్‌ని ఉపయోగించడానికి, దీన్ని ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని Imprintu మొబైల్ యాప్‌కి కనెక్ట్ చేయాలి. నచ్చిన ఇమేజ్ డిజైన్‌లను ఎంచుకుని తాత్కాలిక టాటూలను ప్రింట్ చేయవచ్చు. ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్న టాటూలను తయారు చేయడానికి 2-3సెకన్ల సమయం పడుతుంది. IMPRINTU EXAONEని ఉపయోగించి డిజైన్‌లను సృష్టిస్తుంది, ఇది LG తాజా మల్టీమోడల్ సూపర్‌జెయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో IMPRINTUని ప్రదర్శిస్తుంది, అప్పుడే బ్రాండ్ ఈ టాటూ ప్రింటర్ ధరను కూడా వెల్లడిస్తుందని భావిస్తున్నారు. ఇది 2023 చివరి నాటికి మొదట దక్షిణ కొరియా, USలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.