ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే!
టాటా డిజిటల్ ప్రెసిడెంట్ ముఖేష్ బన్సాల్, టాటాNeu రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగినట్లు సమాచారం. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం గురించి అక్కడ ఉద్యోగుల ద్వారా తెలిసింది Myntra సహ వ్యవస్థాపకుడు బన్సాల్, జూన్ 2021లో టాటా డిజిటల్ లో ప్రెసిడెంట్‌గా చేరారు. అయితే ఇకపై Neu ప్రాథమిక వ్యాపారాలకు సంబంధించిన కీలక విషయాల్లో పాల్గొనడం లేదని, సలహాదారు పాత్రలో మాత్రమే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాటా డిజిటల్ వృద్ధి స్ట్రాటజీకి అనుకూలంగా లేదని, ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. "కొత్త ఇంటర్నెట్ వ్యాపారాన్ని ఎలా స్కేల్ చేయాలనే విధానంలో వ్యత్యాసం ఈ అత్యున్నత స్థాయి అధికారుల మార్పులలో పాత్రను పోషించింది" అని ఓ ఉద్యోగి తెలిపారు.
మొదలుపెట్టి 9 నెలలు అయినా వృద్ది లేదు
టాటా డిజిటల్‌లోని ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రతీక్ మెహతా, శరత్ బులుసు కూడా ఇటీవలే కంపెనీని విడిచిపెట్టారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, ఉడాన్, బ్లింకిట్, ఇతర స్టార్టప్‌ల నుండి వచ్చిన ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వీరిని కూడా బన్సాల్ నియమించుకున్నారు. దాదాపు తొమ్మిది నెలల క్రితం ప్రారంభించిన టాటా న్యూ, ఇప్పటివరకు ఎటువంటి వృద్ధిని సాధించలేదు. గ్రూప్ ఇటీవలే ఆభరణాల బ్రాండ్ తనిష్క్, వాచ్ బ్రాండ్ టైటాన్‌లను ప్లాట్‌ఫారమ్‌లో పెట్టింది. "మార్కెట్ షేర్లపై ప్రభావం కనిపించే ముందు కొంత సమయం పడుతుంది. ఈ యాప్‌తో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వారు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.