కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్
ట్విట్టర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయితే ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలోన్ మస్క్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఈ వేదికకు కొన్ని కొత్త ఫీచర్లను సిఈఓ ప్రకటించారు. ఈ ఫీచర్స్ కు పెద్ద ట్వీట్లలో 10,000 అక్షరాలు, ఏదైనా ఎమోజీలతో వ్యక్తిగత DMలకు ప్రత్యుత్తరం ఇవ్వగల సామర్థ్యం ఉంది. కంపెనీ ఈమధ్య ఆమోదయోగ్యం కానీ ప్రసంగాల మీద జీరో-టాలరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త ఫీచర్లు, ట్విట్టర్ బ్లూ, అతను చేపడుతున్న ఖర్చు తగ్గించే చర్యలు కూడా కంపెనీపై ఆశించిన ప్రభావాన్ని చూపడం లేదు. ప్లాట్‌ఫారమ్ ఇప్పటికీ ప్రధాన ఆదాయమైన ప్రకటనదారులను ఆకర్షించడానికి నానా కష్టాలు పడుతుంది. మస్క్ నమ్మకమైన ఉద్యోగి ఎస్తేర్ క్రాఫోర్డ్ కూడా ఈసారి తన ఉద్యోగాన్ని కోల్పోయింది.
ట్విట్టర్ USలో బ్లూ సబ్‌స్క్రైబర్‌ల అక్షర పరిమితిని 4,000 అక్షరాలకు పెంచింది
ఒక వినియోగదారుకు ప్రతిస్పందిస్తూ, మస్క్ ట్విట్టర్‌లో కంపెనీ "త్వరలో" లాంగ్-ఫార్మ్ ట్వీట్ల అక్షరాల సంఖ్యను 10,000కి పెంచుతుందని చెప్పారు. గత నెలలో, కంపెనీ USలో బ్లూ సబ్‌స్క్రైబర్‌ల అక్షర పరిమితిని 4,000 అక్షరాలకు పెంచింది. కొత్త అప్‌గ్రేడ్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే పరిమితమా అనేది అస్పష్టంగా ఉంది. ఎమోజీలతో DMలకు ప్రత్యుత్తరం ఇచ్చే ఫీచర్ ట్విట్టర్ ప్రవేశపెట్టింది. అయితే, వినియోగదారులు ఆరు ప్రాథమిక ఎమోజీల నుండి మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంది. మరో ట్వీట్‌లో, ట్విట్టర్ వారికి నచ్చిన ఏదైనా ఎమోజీతో DMలకు ప్రత్యుత్తరం ఇచ్చే అవకాశం వస్తుందని మస్క్ తెలిపారు. దీనితో పాటుగా, ట్విటర్ డైరెక్ట్ మెసేజ్‌లకు ఎన్‌క్రిప్షన్‌ను కూడా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది.