LOADING...
Nano Banana 2 : నానో బనానా 2 వచ్చేసింది.. ఒక్క క్లిక్‌తో 4K ఫోటోలు - ఎలా వాడాలో తెలుసుకోండి!
నానో బనానా 2 వచ్చేసింది.. ఒక్క క్లిక్‌తో 4K ఫోటోలు - ఎలా వాడాలో తెలుసుకోండి!

Nano Banana 2 : నానో బనానా 2 వచ్చేసింది.. ఒక్క క్లిక్‌తో 4K ఫోటోలు - ఎలా వాడాలో తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం గూగుల్ తమ ఏఐ సేవలను మరింత శక్తివంతంగా మార్చే దిశగా మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. గూగుల్ జెమిని యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతూ, 'నానో బనానా 2' అనే కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది గూగుల్‌ పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్స్‌లో భాగంగా వచ్చిన తాజా వెర్షన్‌గా నిలుస్తోంది. ఈ కొత్త మోడల్ ప్రత్యేకత ఏమిటంటే, గత వెర్షన్‌తో పోలిస్తే మరింత సహజంగా, నిజమైన ఫొటోల మాదిరిగా చిత్రాలను సృష్టించగలగడం. జెమిని యాప్‌లో ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడ్‌లలో ఇది డిఫాల్ట్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుంది. రియల్‌టైమ్ డేటా, వెబ్ సెర్చ్‌ల ఆధారంగా పనిచేసే ఈ టెక్నాలజీ, యూజర్లకు మరింత ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది.

వివరాలు

ప్రో మోడ్‌లో మరింత మెరుగైన నాణ్యత

'నానో బనానా 2' జెమిని ఫ్లాష్ సూపర్ ఫాస్ట్ ఇంటెలిజెన్స్‌తో విజువల్ జనరేషన్ సామర్థ్యాన్ని కలిపి పనిచేస్తుంది. దీంతో ఫొటో ఎడిటింగ్, జనరేషన్ వేగంగా జరుగుతుంది. ముందుగా కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, ఇప్పుడు మరింత విస్తృతంగా వినియోగదారులకు అందుతోంది. ఈ మోడల్ ద్వారా అద్భుతమైన లైటింగ్, టెక్స్చర్ వివరాలతో హై క్వాలిటీ చిత్రాలను సృష్టించవచ్చు. 512px నుంచి 4K వరకు వివిధ రిజల్యూషన్‌లలో, మల్టిపుల్ యాస్పెక్ట్ రేషియోలతో ఫొటోలను రూపొందించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రో మోడ్‌లో మరింత మెరుగైన నాణ్యత అందుతుంది.

వివరాలు

యూజర్ల చేతిలో పూర్తి నియంత్రణ

ఫీచర్ల విషయానికి వస్తే, నానో బనానా 2 రియల్‌టైమ్ నాలెడ్జ్ బేస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. వెబ్ సెర్చ్, ఫొటోల నుంచి డేటాను మిళితం చేసి ఖచ్చితమైన అవుట్‌పుట్ ఇస్తుంది. మార్కెటింగ్ మాకప్‌లు, గ్రీటింగ్ కార్డ్‌ల కోసం సరైన టెక్స్ట్ జనరేషన్, ఫొటోలలోని టెక్స్ట్ అనువాదం, అవసరానికి తగ్గ ఎడిటింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. యూజర్లు కోరుకున్న విధంగా ఫొటోలను రూపొందించడంలో ఈ మోడల్ మరింత ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది. యాస్పెక్ట్ రేషియో, రిజల్యూషన్ వంటి అంశాలపై పూర్తి నియంత్రణ యూజర్ల చేతుల్లోనే ఉంటుంది.

Advertisement

వివరాలు

వీటిలో ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడ్‌లు 

తయారైన కంటెంట్‌ను వెంటనే వినియోగించుకునే సౌలభ్యం కూడా ఉంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే జెమిని యాప్‌ను ఓపెన్ చేసి, నానో బనానా 2 ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. మొబైల్, డెస్క్‌టాప్‌లలో గూగుల్ యాప్, ఏఐ మోడ్, లెన్స్ ద్వారా 141 దేశాలు, ప్రాంతాల్లో 8 భాషల్లో ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. అలాగే గూగుల్ క్లౌడ్‌లోని వర్టెక్స్ ఏఐ ద్వారా జెమిని ఏపీఐలో ప్రివ్యూ రూపంలో కూడా వినియోగించవచ్చు.

Advertisement