
గారె ఆకారంలో అంగారక గ్రహం మీద రాయిని కనుగొన్న నాసా రోవర్
ఈ వార్తాకథనం ఏంటి
అంగారక గ్రహంపై ఏవైనా జీవులు జీవించిన ఆనవాళ్ళు ఉన్నాయేమో కనుక్కునేందుకు పర్స్ వారెన్స్ రోవర్ ను పంపింది నాసా.
తాజాగా ఈ రోవర్, ఒక పెద్ద రాయిని కనుగొన్నది. గారె మాదిరిగా మధ్యలో చిన్న రంధ్రంతో ఉన్న రాయి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది.
పెద్ద ఉల్కలో ఈ రాయి ఒక భాగం కావచ్చునని SETI (Search for Extraterrestrial Intelligence) వెల్లడి చేసింది.
ఈ రాయి చిత్రాన్ని రోవర్ కు ఉన్న సూపర్ క్యామ్ మైక్రో ఇమేజర్ పరికరం ద్వారా తీయబడింది. ఈ పరికరం సాయంతో దూరంగా ఉన్న వస్తువును అత్యధిక రిజల్యూషన్ తో ఫోటో తీయడంతో పాటు ఆ వస్తువులోని రసాయన మూలకాలను గుర్తిస్తుంది.
Details
గతంలోనూ రాయిని కనుగొన్న రోవర్
అంగారక గ్రహంపై ఇలాంటి రాయిని గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో పర్స్ వారెన్స్ రోవర్ దిగిన కొద్దిసేపటికే ఒకానొక రాయిని కనుగొన్నది.
ఈ రోవర్, ప్రస్తుతం అంగారక గ్రహం మీద జెజెరో అని పిలవబడే పెద్ద సొరంగంలో తిరుగుతుంది. 45కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సొరంగం, పురాతన కాలంలో నది కావచ్చునని అనుకుంటున్నారు.
ఈ సొరంగంలో తిరుగుతున్న రోవర్, అంగారక గ్రహం మీద గతంలో జీవం ఉందని సూచించే ఆధారాల కోసం చూస్తుంది.
ఈ రోవర్ కు హెలికాప్టర్ జతచేయబడి ఉంటుంది. దీనివల్ల రోవర్ కు రక్షణ ఉంటుంది. అలాగే 1.8 కిలోల ఛాపర్, అంగారక గ్రహం మీద సైన్స్ విషయాలను వెతుకుతుంది.