Loading...
NASA: సౌర తుఫాన్లపై కొత్త హెచ్చరిక.. అంచనాలకంటే తీవ్రంగా ఉండొచ్చన్న నాసా
సౌర తుఫాన్లపై కొత్త హెచ్చరిక.. అంచనాలకంటే తీవ్రంగా ఉండొచ్చన్న నాసా

NASA: సౌర తుఫాన్లపై కొత్త హెచ్చరిక.. అంచనాలకంటే తీవ్రంగా ఉండొచ్చన్న నాసా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమిని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ల తీవ్రతను ఇప్పటివరకు తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మేరీల్యాండ్‌లోని నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రముఖ శాస్త్రీయ జర్నల్ Natureలో ప్రచురితమైంది. ఇప్పటివరకు సౌర తుఫాన్ల ద్వారా భూమి ధ్రువ ప్రాంతాల అయోనోస్ఫియర్‌కు చేరే శక్తికి ఒక గరిష్ఠ పరిమితి ఉంటుందని భావించినప్పటికీ,అలాంటి పరిమితి ఉండకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయన సహ రచయిత మారియా వాలాక్ మాట్లాడుతూ, అత్యంత తీవ్రమైన సౌర తుఫాన్లు చాలా అరుదుగా సంభవిస్తాయని, అందువల్ల వాటిపై అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా పరిమితంగా ఉందన్నారు.

వివరాలు 

సౌర తుఫాన్లను కొలిచే విధానంలోనే పరిమితులు ఉన్నాయన్నా పరిశోధకులు

వెయ్యేళ్లకు ఒకసారి సంభవించే స్థాయి ఘటనలు జరిగితే భూమి ఎలా స్పందిస్తుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టమని ఆమె తెలిపారు.

సౌర గాలుల ప్రభావానికి భూమి స్పందనకు నిజంగానే పరిమితి లేకపోతే, భవిష్యత్తు నమూనాలు (మోడల్స్) కూడా దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ సమస్యకు కారణం పరికరాల్లో లోపం కాదని, సౌర తుఫాన్లను కొలిచే విధానంలోనే పరిమితులు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

భూమిని చేరకముందే సౌర కణాలను గుర్తించే పరికరాలు, సౌర తుఫాన్లు ప్రయాణంలో కోల్పోయే శక్తిని పూర్తిగా నమోదు చేయలేకపోతున్నాయని వివరించారు.

వివరాలు 

10 లక్షలకు పైగా సౌర గాలుల కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు

నాసాకు చెందిన IMAP అంతరిక్ష నౌక లాగ్రాంజ్ పాయింట్-1 (L1) వద్ద ఉండి సూర్యుడి నుంచి విడుదలయ్యే సౌర కణాలు,కరోనా మాస్ ఈజెక్షన్ల (CMEs)పై ముందస్తు సమాచారం అందిస్తోంది.

అయితే ఈ పరికరం భూమి మాగ్నెటోషీత్‌ను చేరకముందే సేకరించిన డేటాపైనే ఆధారపడటం వల్ల, వాస్తవ పరిస్థితులతో పోలిస్తే సౌర గాలుల తీవ్రతను ఎక్కువగా అంచనా వేసే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.

ఈ అంశాన్ని నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు నాసాకు చెందిన THEMIS, MMS, అలాగే DoubleStar మిషన్ల ద్వారా సేకరించిన 10 లక్షలకు పైగా సౌర గాలుల కొలతలను విశ్లేషించారు.

ADVERTISEMENT

వివరాలు 

తీవ్రమైన సౌర తుఫాన్లు సంభవిస్తే ఉపగ్రహాల కక్ష్యలు దెబ్బతినే అవకాశం

వాటిని మాగ్నెటోషీత్, మాగ్నెటోస్ఫియర్ ప్రాంతాల్లో నమోదైన సాధారణ కొలతలతో పోల్చిన అనంతరం, సౌర గాలుల నుంచి భూమి ధ్రువ ప్రాంతాల అయోనోస్ఫియర్‌కు బదిలీ అయ్యే శక్తికి ప్రస్తుతం గరిష్ఠ పరిమితి ఉందని నిర్ధారించే గణాంక ఆధారాలు లేవని తేల్చారు.

అత్యంత తీవ్రమైన సౌర తుఫాన్లు సంభవిస్తే ఉపగ్రహాల కక్ష్యలు దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు, జీపీఎస్ వంటి నావిగేషన్ సేవలకు అంతరాయం కలగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అయితే భూమి అయస్కాంత క్షేత్రం సాధారణంగా అంతరిక్ష వాతావరణ ప్రభావాల నుంచి సమర్థంగా రక్షిస్తోందని మారియా వాలాక్ తెలిపారు.

భవిష్యత్తులో ఒక భారీ సౌర తుఫాను సంభవించిన తర్వాతే భూమి మాగ్నెటోస్ఫియర్ ఎంత మేర రక్షణ కల్పించగలదో స్పష్టంగా తెలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT