
Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త నంబర్ వచ్చినప్పుడు 'ఎవరిదీ?' అని సందేహించకుండానే ట్రూకాలర్‌లో వెతికి తెలుసుకునే అలవాటు చాలామందికి ఉంది.
ఇకపోతే ట్రూకాలర్ యాప్‌ను ఉపయోగించి కొంతమంది ముందే ఆ నంబర్ ఎవరిదో గుర్తిస్తారు.
ఈ క్రమంలో ఇప్పుడు ట్రూకాలర్ వినియోగదారుల మెసేజ్ ఇన్‌బాక్స్‌ను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు కొత్త ఫీచర్‌ను అందించింది.
AI ఆధారిత మెసేజ్ IDలు అనే ఫీచర్‌ను ట్రూకాలర్ తాజాగా ప్రవేశపెట్టింది.
ఈ మెసేజ్ ID ఫీచర్ వల్ల స్పామ్ సందేశాల మధ్య లో ధృవీకరించిన వ్యాపారాల నుంచి వచ్చిన ముఖ్యమైన మెసేజ్‌లను వినియోగదారులు సులభంగా గుర్తిస్తారు.
ఈ సేవలు ట్రూకాలర్ ప్రీమియం యూజర్లకే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉన్నాయి.
Details
30 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో
ఈ ఫీచర్ ద్వారా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగించి SMS ఇన్‌బాక్స్‌ను స్కాన్ చేసి, ఓటీపీలు, డెలివరీ అప్‌డేట్స్, టికెట్ బుకింగ్ స్టేటస్ వంటి మెసేజ్‌లను గుర్తిస్తుంది.
ఒక్క వాటికే పరిమితం కాకుండా ఇతర ముఖ్యమైన సందేశాలను కూడా ఈ ఫీచర్ గుర్తించగలదు. ఇందులో ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయడం ద్వారా వినియోగదారుడు తక్షణమే స్పందించేందుకు అవకాశం కల్పిస్తుంది.
ట్రూకాలర్ ప్రకారం, ఈ మెసేజ్ IDలు ఇన్‌బాక్స్‌లో ఆకుపచ్చ చెక్ మార్క్‌తో కనిపిస్తాయి. ఈ సేవలు భారత్‌తో పాటు 30 ఇతర దేశాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇది ఇంగ్లీష్, హిందీ, స్వాహిలి, స్పానిష్‌తో సహా అనేక భారతీయ, అంతర్జాతీయ భాషలకు మద్దతును అందిస్తుంది.