Page Loader
నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్
ఫేక్ కాల్స్ కు చెక్ పెట్టనున్న ట్రాయ్

నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2023
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంస్ లో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ట్రాయ్ కొత్త ఫీల్టర్ ప్రవేశపెట్టడం వల్ల కస్టమర్లకు అనవరస కాల్స్, మెసేజ్ నుండి విముక్తి కలగనుంది. ఈమేరకు టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త ఆదేశాలకు జారీ చేసింది. నేటి నుంచి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ కోసం కృత్రిమ మేదస్సు స్పామ్ ఫిల్టర్లను అమలు చేస్తున్నాయి. నకిలీ కాల్స్, సందేశాలను నిరోధించడానికి ఈ ఫీల్టర్ పని చేస్తుంది. కావున ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు కస్టమర్లకు చేరే అవకాశం ఉండదు. Airtel, Jio, Vodafone, Idea, BSNL వంటి టెలికాం కంపెనీలు AI ఫీల్టర్ లను ఇన్ స్టాల్ చేయడానికి ముందుకొచ్చాయి.

Details

ఫేక్ కాల్స్ నుండి యూజర్లకు విముక్తి

AI ఫిల్టర్ సేవను అమలు చేయడానికి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఎయిర్‌టెల్ ఈ విషయాన్ని అధికారికంగా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. అయితే Jio త్వరలో ఈ సేవను ప్రారంభించనుంది. ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను నిరోధించడానికి TRAI చాలా రోజుల నుండి కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.10 అంకెల మొబైల్ నంబర్ల నుండి ప్రమోషన్ కాల్‌లను నిషేధించాలని ట్రాయ్ డిమాండ్ చేస్తోంది. మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై వారి ఫోటో, పేరు చూపడం ద్వారా కస్టమర్‌లు కాలర్‌ను గుర్తించడంలో సహాయపడే కాల్ ఐడి ఫీచర్‌ను అమలు చేయాలని ప్రభుత్వం టెల్కోలను కోరింది. అయితే గోప్యతా సమస్యల కారణంగా కంపెనీలు ఈ ఫీచర్ ను తీసుకురావడానికి కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.