
Pawan Goenka: భారత అంతరిక్ష రంగానికి కొత్త దిశ చూపించిన పవన్ గోయెంకా
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ గోయెంకా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త, అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయన తన అద్భుతమైన విశ్లేషణా నైపుణ్యాలు, నేతృత్వం, ఆవిష్కరణలతో భారత అంతరిక్ష, ఆటోమోటివ్ రంగాలను బలోపేతం చేశారు. ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్ కుమార్ గోయెంకాకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. గోయెంకా ప్రస్తుతం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ గోయెంకా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్‌కు చైర్మన్‌గా ఉన్నారు.
Details
ట్రైబాలజీలో చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు
గోయెంకా ఐఐటీ-కాన్పూర్‌లో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. జనరల్ మోటార్స్ R&D సెంటర్‌లో 14 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉంది. వాహన ఇంజనీరింగ్, ఇంధన సామర్థ్యం వంటి రంగాల్లో కీలకమైన పరిశోధనలు చేశారు. ట్రైబాలజీలో ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఇంజిన్ ఫ్రిక్షన్, ఇంజిన్ బేరింగ్ విశ్లేషణకు ఆయన అభివృద్ధి చేసిన పద్ధతులు ఇప్పటికీ ఉపయోగంలో ఉండడం విశేషం.
Details
స్కార్పియో SUV డిజైన్ చేయడంలో పవన్ కుమార్ కీలక పాత్ర
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో 28 సంవత్సరాలు పాటు పనిచేసి కీలక బాధ్యతలు నిర్వహించారు. 2021లో ఎండీ, సీఈఓగా పదవీ విరమణ చేశారు. స్కార్పియో SUV డిజైన్ చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. అంతరిక్ష రంగంలో యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందిస్తూ, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. విద్యారంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, భారత యువతను సాంకేతికత వైపు ముందుకు నడిపిస్తున్నారు.