LOADING...
Pink Full Moon 2026: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పింక్ మూన్
ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పింక్ మూన్

Pink Full Moon 2026: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పింక్ మూన్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెలలో ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. వసంత కాలంలో వచ్చే తొలి పౌర్ణమి అయిన "పింక్ మూన్" రేపు రాత్రి ఆకాశాన్ని అలరించనుంది. ఈ నెలలో ప్రధాన చంద్ర ఘటనగా భావిస్తున్న ఈ పౌర్ణమి ఏప్రిల్ 2 తెల్లవారుజామున 3:12 గంటలకు పూర్తి ప్రకాశాన్ని అందుకోనుంది. అయితే, ఏప్రిల్ 1 సాయంత్రం చంద్రుడు క్షితిజం నుంచి పైకి వస్తూ కనిపించే దృశ్యం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

వివరాలు 

పింక్ మూన్ అని ఎందుకు అంటారు?

"పింక్ మూన్" అనే పేరు వినగానే చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని అనుకోవచ్చు. కానీ నిజానికి చంద్రుడు పింక్ రంగులో కనిపించడు. ఈ పేరు అమెరికాలోని ప్రాచీన స్థానిక గిరిజన తెగల సంప్రదాయం నుంచి వచ్చింది. వారు ప్రతి నెల పౌర్ణమికి ఒక ప్రత్యేక పేరు పెట్టేవారు. వసంత కాలం ప్రారంభంలో పూసే గులాబీ రంగు అడవి పూలు, ముఖ్యంగా "వైల్డ్ గ్రౌండ్ ఫ్లోక్స్" ఆధారంగా ఈ పౌర్ణమికి "పింక్ మూన్" అనే పేరు వచ్చింది. అందుకే ఈ రోజు చంద్రుడు గులాబీగా కాకుండా నారింజ, రాగి లేదా బంగారు పసుపు రంగులో మెరిసే అవకాశం ఉంది.

వివరాలు 

చంద్రుడు రంగు ఎందుకు మారుతుంది?

చంద్రుడు రంగు మారడానికి కారణం ఒక సాదా భౌతిక శాస్త్ర సూత్రం. చంద్రుడు అస్తమానం దగ్గరగా ఉన్నప్పుడు, అతని మీద పడే సూర్యకాంతి భూమి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సమయంలో చిన్న తరంగదైర్ఘ్యం కలిగిన నీలం, ఊదా కాంతి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. మిగిలేది పెద్ద తరంగదైర్ఘ్యం గల ఎరుపు, నారింజ, పసుపు కాంతి. అందువల్ల చంద్రుడు రాగి రంగు, నారింజ లేదా బంగారు రంగులో కనిపిస్తాడు. ఇది సూర్యాస్తమయం సమయంలో కనిపించే రంగులతో పోలి ఉంటుంది.

Advertisement

వివరాలు 

స్పికా నక్షత్రం కూడా కనిపించనుంది

ఈ పింక్ మూన్‌తో పాటు ఆకాశ వీక్షకులకు మరో ప్రత్యేక అవకాశం ఉంది. Spica star అనే ప్రకాశవంతమైన ద్వంద్వ నక్షత్ర వ్యవస్థ కూడా కనిపించనుంది. ఈ నక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది. చంద్రుడు,స్పికా దగ్గరగా కనిపించడం వల్ల ఆకాశంలో మరింత ఆకర్షణీయమైన దృశ్యం ఏర్పడుతుంది. ఈ వారం పొడవునా కొనసాగే ఈ చంద్ర దర్శనం ఖగోళ శాస్త్రాభిమానులను ఎంతగానో ఆకట్టుకోనుంది.

Advertisement