Loading...
Plastic Pen: ఇద్దరు వ్యోమగాముల ప్రాణాలు కాపాడిన చిన్న ప్లాస్టిక్ పెన్‌కు వేలంలో రికార్డు ధర
ఇద్దరు వ్యోమగాముల ప్రాణాలు కాపాడిన చిన్న ప్లాస్టిక్ పెన్‌కు వేలంలో రికార్డు ధర

Plastic Pen: ఇద్దరు వ్యోమగాముల ప్రాణాలు కాపాడిన చిన్న ప్లాస్టిక్ పెన్‌కు వేలంలో రికార్డు ధర

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

1969 జూలైలో జరిగిన చారిత్రాత్మక అపోలో-11 చంద్రయాన మిషన్‌లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై తొలి అడుగులు వేసి చరిత్ర సృష్టించారు. అయితే ప్రపంచానికి తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వారు చంద్రుడి ఉపరితలంపైనే శాశ్వతంగా చిక్కుకుపోయే ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆ ప్రమాదం నుంచి వారిని కాపాడింది ఎలాంటి ఆధునిక పరికరం కాదు.. సాధారణ ప్లాస్టిక్ పెన్. తాజాగా అదే పెన్ అంతర్జాతీయ వేలంలో 8,57,600 డాలర్లకు (సుమారు రూ.7 కోట్లకుపైగా) అమ్ముడైంది. చంద్రుడిపై దిగిన తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌,బజ్ ఆల్డ్రిన్ లూనార్ మాడ్యూల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక కీలకమైన సర్క్యూట్ బ్రేకర్ స్విచ్ విరిగిపోయింది.

వివరాలు 

ఇద్దరు వ్యోమగాములు చంద్రుడిపైనే చిక్కుకుపోయే పరిస్థితి

ఆ స్విచ్ పనిచేయకపోతే చంద్రుడి ఉపరితలం నుంచి భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించే అసెంట్ ఇంజిన్‌కు విద్యుత్ సరఫరా అందేది కాదు.

అంటే ఇద్దరు వ్యోమగాములు చంద్రుడిపైనే చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన గురించి బజ్ ఆల్డ్రిన్ తన 2009లో విడుదలైన 'Magnificent Desolation' ఆత్మకథలో వివరించారు.

ఇంజిన్‌ను ప్రారంభించడానికి అత్యంత కీలకమైన సర్క్యూట్ బ్రేకర్ స్విచ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిందని ఆయన పేర్కొన్నారు.

అయితే బజ్ ఆల్డ్రిన్‌కు ఓ తెలివైన ఆలోచన వచ్చింది. తన వ్యక్తిగత వస్తువుల్లో ఉన్న వెండి రంగు ప్లాస్టిక్ డ్యూరో రాకెట్ ఫెల్ట్-టిప్ పెన్ను విరిగిన సర్క్యూట్ బ్రేకర్ స్థానంలో జాగ్రత్తగా అమర్చారు.

దీంతో విద్యుత్ సరఫరా మళ్లీ పునరుద్ధరించబడింది.

వివరాలు 

వేలంలో బజ్ ఆల్డ్రిన్ సంతకం చేసిన ధృవీకరణ లేఖ

అసెంట్ ఇంజిన్ విజయవంతంగా పనిచేయడంతో ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా చంద్రుడి ఉపరితలం నుంచి బయలుదేరి భూమికి తిరిగి చేరుకోగలిగారు.

ఈ పెన్‌తో పాటు బజ్ ఆల్డ్రిన్ సంతకం చేసిన ధృవీకరణ లేఖను కూడా వేలంలో ఉంచారు.

అందులో"స్విచ్‌ను నీల్ విరగగొట్టాడని నేను అనుకుంటాను..నేను విరగగొట్టానని నీల్ అనుకుంటాడు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

8,57,600డాలర్లకు అమ్ముడైన పెన్ 

అయితే చివరికి స్విచ్ సమస్యకు పరిష్కారం కనుగొని భూమికి తిరిగి రావడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబీస్ ఈ పెన్ ధర 8 లక్షల నుంచి 12 లక్షల డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

ఐదుగురు బిడ్డర్ల మధ్య తీవ్ర పోటీ అనంతరం చివరకు ఈ చారిత్రాత్మక పెన్ 8,57,600డాలర్లకు అమ్ముడై అంతరిక్ష చరిత్రలో అత్యంత విలువైన జ్ఞాపికల్లో ఒకటిగా నిలిచింది.

ADVERTISEMENT