Google India: గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియామకం
టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశం కోసం కొత్త వైస్ ప్రెసిడెంట్,కంట్రీ మేనేజర్‌గా ప్రీతి లోబానా నియమించబడినట్లు సోమవారం ప్రకటించింది. ఇంతకు ముందు ఈ పదవిని నిర్వహించిన సంజయ్ గుప్తా గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా బదిలీ కావడంతో,ఈ కీలక బాధ్యతలకు ప్రీతి లోబానాను ఎంపిక చేసింది. ఈ నియామకంతో,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)టెక్నాలజీని కస్టమర్లకు మరింత చేరువ చేయడం,కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ప్రీతి కీలక పాత్ర పోషిస్తారని గూగుల్ ప్రకటించింది. కస్టమర్-సెంట్రిక్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన ప్రీతి,గూగుల్ ఇండియా లో అమ్మకాలు,కార్యకలాపాల బాధ్యతలను నిర్వహించనున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న ఈ సమయంలో, దీన్ని మరింత విస్తరించడంలో ఆమె నైపుణ్యం చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంజయ్ గుప్తా అభిప్రాయపడ్డారు.