Page Loader
భారత మార్కెట్లోకి రియల్ మీ సీ53, ప్యాడ్ 2 లాంచ్.. ఫీచర్స్ ఇవే!
భారత మార్కెట్లోకి రియల్ మీ సీ53, ప్యాడ్ 2 లాంచ్.. ఫీచర్స్ ఇవే!

భారత మార్కెట్లోకి రియల్ మీ సీ53, ప్యాడ్ 2 లాంచ్.. ఫీచర్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ భారత మార్కెట్లోకి ఒక స్మార్ట్‌ఫోన్, ఒక ప్యాడ్‌ను విడుదల చేసింది. రియల్ మీ సీ53, ప్యాడ్ 2 ను తక్కువ బడ్జెట్ ధరకే వీటిని తీసుకొచ్చింది. ఇంతకుముందు మలేషియాలో రియల్ మీ సీ53ని ఫోన్ ని లంచ్ చేసిన విషయం తెలిసిందే. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును ఈ ఫోన్ కలిగి ఉంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు, 650 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది.

Details

రియల్ మీ సీ53 ధర రూ.9,999

రియల్ మీ సీ53లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో రెండు టిగా బైట్ల వరకు స్టోరేజీ కెపాసిటీని పెంచుకొనే అవకాశం ఉంది. రియల్ మీ ప్యాడ్ 2 40Hz/60Hz/120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌లతో 11.5-అంగుళాల 2K (1200x2000 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. టాప్-మౌంటెడ్ పవర్ బటన్, నాలుగు స్పీకర్లు, టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,360mAh బ్యాటరీ ప్యాకప్ ఉండనుంది. Realme Pad 2లో 8MP కెమెరా, వెనుకవైపు LED ఫ్లాష్ ఉంది. భారతదేశంలో, Realme C53 ధర రూ. 9,999 ఉండగా.. రియల్ మీ ప్యాడ్ 2 ధర రూ. 19,999 ఉండనుంది. వీటి ప్రీ-ఆర్డర్లు జూలై 26 నుండి ప్రారంభమవుతాయి.