Page Loader
Realme Narzo 60x : తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ నార్జో 60x 5జీ ఫోన్.. ధర ఎంతంటే?
తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ నార్జో 60x 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

Realme Narzo 60x : తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ నార్జో 60x 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2023
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను ప్రముఖ కంపెనీ రియల్ మీ అందుబాటులో తెస్తోంది. తాజాగా రియల్ మీ నార్జో 60x పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అధునాతన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర తక్కువగా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. Narzo 60x 5Gలో 6.7-అంగుళాల 120Hz స్క్రీన్, డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 50MP కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 4జీబీ రామ్, 128జీవీ మోడల్ ధర రూ.10,999 ఉండగా, 6జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది.

Details

సెప్టెంబర్ 15న విక్రయాలు ప్రారంభం

సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12:00 గంటలకు ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి 1000 కూపన్ కూడా లభించనుంది. నార్జో 60x 5G 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పూర్తి-HD+ రిజల్యూషన్, డైనమిక్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించే అవకాశం ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు, రెండు రంగులతో అందుబాటులోకి వచ్చింది. కెమెరా ఫీచర్లలో మూడు కొత్త ఫిల్టర్‌లతో సూపర్ నైట్‌స్కేప్ మోడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ ఉన్నాయి. ఈ ఫోన్ అండ్రాయిడ్ 13-ఆధారిత Realme UI 4.0పైన నడవనుంది.