Page Loader
ChatGPT: 'చాట్‌జీపీటీ నా ప్రాణాన్ని కాపాడింది'..రోగ నిర్ధారణలో విప్లవాత్మక మార్పు 
'చాట్‌జీపీటీ నా ప్రాణాన్ని కాపాడింది'..రోగ నిర్ధారణలో విప్లవాత్మక మార్పు

ChatGPT: 'చాట్‌జీపీటీ నా ప్రాణాన్ని కాపాడింది'..రోగ నిర్ధారణలో విప్లవాత్మక మార్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ, విప్లవాత్మక అభివృద్ధితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాల్లో ఉపయోగపడుతూ, ప్రజల జీవితాలను మారుస్తుంది. వాటిలో ముఖ్యంగా చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్లకు అద్భుతమైన సహాయం అందిస్తోంది. ప్రజలు అడిగే ప్రతీ ప్రశ్నకు చాట్‌జీపీటీ వేగంగా, ఖచ్చితమైన జవాబులను అందిస్తుంది. తాజాగా, చాట్‌జీపీటీ ఒక వ్యక్తికి ఉన్న రోగాన్ని కనుగొన్న సంఘటన నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

వివరాలు 

టెస్ట్‌లు నిర్వహించిన డాక్టర్లు 

ఓ సోషల్ మీడియా యూజర్ తన అనుభవాన్ని షేర్ చేస్తూ,"కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేశాను. కానీ,ఆ తరువాత నా ఒళ్ళంతా తీవ్రమైన నొప్పులు ఏర్పడినాయి. అనేక గంటలు గడిచినా,నా ఆరోగ్యం మెరుగుపడలేదు.ఈ లక్షణాలు చూస్తూ, నేను వాటిని చాట్‌జీపీటీకి వివరించాను.ఆ లక్షణాల ఆధారంగా చాట్‌జీపీటీ రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis)అనే రోగం ఉన్నట్లు చెప్పింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సలహా ఇచ్చింది." ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని,అతను ఆసుపత్రికి వెళ్లాడు.అక్కడ డాక్టర్లు టెస్ట్‌లు నిర్వహించి,రాబ్డోమయోలైసిస్‌ అనే రోగం ఉందని నిర్ధారించారు. "నా ల్యాబ్ ఫలితాలను కూడా చాట్‌జీపీటీతో విశ్లేషించాను.వైద్య బృందం చెప్పినదాన్ని కూడా చాట్‌జీపీటీ పరిగణనలో తీసుకుంది.అప్పుడు దానిపై సమీక్షలు చేస్తూ,సరైన సమయానికి చికిత్స పొందడం వల్ల ప్రాణాలు కాపాడుకున్నాను,"అని అతను చెప్పాడు.

వివరాలు 

రాబ్డోమయోలైసిస్ 

ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనపై పలువురు వ్యక్తులు చాట్‌జీపీటీని ప్రశంసిస్తూ, దీనిని వైద్య సలహా కోసం కూడా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాబ్డోమయోలైసిస్‌ అనేది ఓ అరుదైన సమస్య. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోకుండా,అధిక వ్యాయామం చేయడం వల్ల కండరాలు కలిగిపోతాయి. ఈ కండరాల నుండి రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోయి,ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్య ప్రాణాంతకం కూడా కావచ్చు, కాబట్టి దీని పట్ల జాగ్రత్త అవసరం. ఈ సంఘటన ద్వారా, చాట్‌జీపీటీ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతున్నాయి. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడడంలో కూడా సహాయపడుతోందని పలువురు గుర్తించారు.