Page Loader
Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా?
జనవరి 5న లాంచ్ కాబోతున్న Redmi Note 12 5G

Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా?

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 26, 2022
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

Redmi Note 12 సిరీస్ వచ్చే నెల జనవరి 5న భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఈసారి Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ సహా మూడు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేస్తోంది. Redmi Note 12 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది, కానీ చైనా మోడల్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మూడు కెమెరాలతో వస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ విడుదల చేసిన టీజర్‌లో Redmi Note 12 5Gలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలిపింది. చైనాలో అందుబాటులో ఉన్న మోడల్ కంటే మెరుగైన కెమెరాను ఆఫర్ చేస్తున్నందున ఫోన్ ధర భారతదేశంలో రూ. 15000 ఉంటుందని భావిస్తున్నారు.

Redmi Note

ఇది ఇప్పటివరకు లాంచ్ చేసినవాటిల్లో అత్యంత నాజూకు Redmi Note

రాబోయే Redmi Note 12 5G సెంటర్డ్ పంచ్-హోల్ నాచ్‌తో AMOLED డిస్‌ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇప్పటి వరకు లాంచ్ చేయబడిన వాటిలో అత్యంత నాజూకు Redmi Note అని అమెజాన్ టీజర్ వెల్లడించింది. చైనాలో 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ఉన్న ఈ Redmi Note 12 ధర దాదాపుగా రూ. 13500. ఇందులో మూడు ఇతర మోడల్‌లు ఉన్నాయి. 6GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర సుమారు రూ. 14500, 8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర దాదాపు రూ. 1490, 8GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర దాదాపు రూ. 19300.