Samsung adds Perplexity: "హే ప్లెక్స్" అనగానే రెడీ.. గెలాక్సీ ఫోన్లలో కొత్త ఏఐ అసిస్టెంట్
ఈ వార్తాకథనం ఏంటి
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) కీలక ప్రకటన చేసింది. గెలాక్సీ ఎకోసిస్టమ్‌లోకి Perplexity AIను ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. రోజువారీ పనులను మరింత సులభం చేసేందుకు ఓపెన్, ఇంటిగ్రేటెడ్ మల్టీ-ఏజెంట్ సిస్టమ్ రూపొందించే ప్లాన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇకపై ఏఐ సహాయం యాప్‌లకు పరిమితం కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలోనే పనిచేసేలా రూపకల్పన చేస్తున్నామని వెల్లడించింది. శాంసంగ్ రీసెర్చ్ ప్రకారం దాదాపు 80 శాతం యూజర్లు పనికి అనుగుణంగా రెండు కంటే ఎక్కువ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తున్నారని సమాచారం. సెర్చ్, ప్రొడక్టివిటీ, రిమైండర్లు, కంటెంట్ క్రియేషన్ వంటి అవసరాల కోసం వేర్వేరు అసిస్టెంట్ల మధ్య మారడం పెరుగుతోందని కంపెనీ గుర్తించింది.
వివరాలు
గెలాక్సీ పరికరాల్లో పర్‌ప్లెక్సిటీ AIని ఎలా యాక్సెస్ చేయాలి?
ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని గెలాక్సీ ఏఐను మరింత విస్తరింపజేస్తోంది. "గెలాక్సీ ఏఐ వేర్వేరు ఏఐ సర్వీసులను ఒకే చోట కలిపే ఆర్కెస్ట్రేటర్‌లా పనిచేస్తుంది. యూజర్లు యాప్ నుంచి యాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫ్రేమ్‌వర్క్ లెవెల్‌లోనే సమగ్ర అనుభవాన్ని ఇస్తుంది" అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ అధ్యక్షుడు వోన్-జూన్ చోయ్ తెలిపారు. రాబోయే ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ డివైస్‌లలో పెర్‌ప్లెక్సిటీ ఏఐ అదనపు ఏజెంట్‌గా అందుబాటులోకి రానుంది. "హే ప్లెక్స్"అనే వేక్ ఫ్రేజ్‌తో లేదా సైడ్ బటన్‌ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. నోట్స్, క్లాక్, గ్యాలరీ, రిమైండర్, క్యాలెండర్ వంటి సామ్‌సంగ్ యాప్‌లతో పాటు కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లలో కూడా ఇది పనిచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
త్వరలో సపోర్ట్ చేసే డివైస్‌లు, టైమ్‌లైన్‌పై పూర్తి వివరాలు
ఒక్క అసిస్టెంట్ ఆధిపత్యం కాకుండా ఓపెన్ ఏఐ ఎకోసిస్టమ్ వైపు పరిశ్రమ మొత్తం కదులుతున్న నేపథ్యంలో శాంసంగ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. యూజర్లకు ఎంపిక, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలన్నదే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. సపోర్ట్ చేసే డివైస్‌లు, టైమ్‌లైన్‌పై పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కానీ దిశ మాత్రం స్పష్టంగా ఉంది... వేర్వేరు ఏఐ సర్వీసులను ఒకే అనుభవంగా కలిపే కనెక్టివ్ లేయర్‌గా గెలాక్సీ ఏఐను మలచాలని శాంసంగ్ లక్ష్యంగా పెట్టుకుంది.