LOADING...
Samsung Galaxy:ఏఐ టెక్నాలజీతో శాంసంగ్‌ గెలాక్సీ A56, A36, A26 లాంచ్‌ 
ఏఐ టెక్నాలజీతో శాంసంగ్‌ గెలాక్సీ A56, A36, A26 లాంచ్‌

Samsung Galaxy:ఏఐ టెక్నాలజీతో శాంసంగ్‌ గెలాక్సీ A56, A36, A26 లాంచ్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ గ్లోబల్‌గా మూడు కొత్త మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. గెలాక్సీ 'ఏ' సిరీస్‌లో గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 పేరుతో ఈ డివైజ్‌లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. IP67 రేటింగ్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌యు7తో పనిచేసే ఈ ఫోన్లకు ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇక ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధరలు ఇలా ఉన్నాయి.

Details

గెలాక్సీ A26 ఫీచర్లు, ధర

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌ రేటు, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ Exynos 1300 ప్రాసెసర్ 6GB+128GB, 8GB+128GB/256GB వేరియంట్లు 50MP OIS ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 13MP ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ధర: 26,200 రంగులు: పింక్, ఆలివ్, గ్రాఫైట్, లైట్‌ గ్రే

Details

 గెలాక్సీ A36 స్పెసిఫికేషన్స్, ధర 

6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7+ లేయర్ ప్రొటెక్షన్ - Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ 6GB+128GB, 8GB+128GB/256GB, 12GB+256GB వేరియంట్లు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 5MP మాక్రో లెన్స్ 12MP సెల్ఫీ కెమెరా ధర: 35,000 నుంచి ప్రారంభం రంగులు: లావెండర్, బ్లాక్, వైట్, లైమ్

Details

 గెలాక్సీ A56 హై-ఎండ్ ఫీచర్లు, ధర 

6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7+ ప్రొటెక్షన్ Exynos 1580 ప్రాసెసర్ - 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ 8GB+128GB/256GB, 12GB+256GB వేరియంట్లు 50MP OIS ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ధర: 44,000 నుంచి ప్రారంభం శాంసంగ్‌ ఈ మూడు మోడల్స్‌ను మిడ్‌రేంజ్‌, హై-ఎండ్ సెగ్మెంట్లో లాంచ్ చేయగా, ఆండ్రాయిడ్‌ 15, వన్‌యు7, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్ వంటి అప్‌డేట్‌లతో ఇది వినియోగదారుల్ని ఆకట్టుకునే అవకాశముంది. AI ఫీచర్లు, మెరుగైన కెమెరా, హై-స్పీడ్ చిప్‌సెట్‌లు ఈ ఫోన్లకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.