Samsung Galaxy S27 : శాంసంగ్ గాలక్సీ S27 Ultra కెమెరాలో భారీ మార్పులు.. లీక్‌లో కీలక వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ ప్రపంచంలో శాంసంగ్ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S27 Ultraకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ Ice Universe ఈ ఫోన్‌కు సంబంధించిన CAD రెండర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఫోన్ కెమెరా డిజైన్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిలువు కెమెరా అమరికకు బదులుగా కొత్తగా అడ్డంగా ఉండే కెమెరా కటౌట్‌ను తీసుకురానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఇందులో మూడు కెమెరా కటౌట్లు కనిపిస్తున్నాయి. Galaxy S27 సిరీస్‌ను 2027 జనవరి-ఫిబ్రవరి మధ్య మార్కెట్లోకి తీసుకురావచ్చని అంచనా.
వివరాలు
కెమెరా డిజైన్ iPhone 17 Pro తరహాలో?
Galaxy S27 Ultraలో కెమెరాల అమరిక ప్రస్తుత Galaxy S26 Ultra కంటే భిన్నంగా ఉండనున్నట్లు సమాచారం.
ప్రధాన వైడ్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫొటో సెన్సర్లను రెండు వేర్వేరు కటౌట్లలో అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మూడో కటౌట్‌లో అల్ట్రా-వైడ్, టెలిఫొటో కెమెరా సెన్సర్లు ఉండొచ్చని అంచనా. వీటి మధ్యలో ఫ్లాష్‌ను అమర్చనున్నట్లు సమాచారం.
ఈ కొత్త డిజైన్‌పై కొంతమంది వినియోగదారులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఇది iPhone 17 Pro సిరీస్ కెమెరా డిజైన్‌ను పోలి ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
వివరాలు
మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్
Galaxy S27 Ultraలో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండొచ్చని లీక్‌లు చెబుతున్నాయి.
దీని ద్వారా ప్రత్యేక యాక్సెసరీలను ఫోన్‌కు మాగ్నెటిక్‌గా అమర్చుకోవడంతో పాటు వైర్‌లెస్‌గా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
డిజైన్ పరంగా Galaxy S26 Ultraలో ఉన్న గుండ్రటి అంచులనే కొత్త ఫోన్‌లోనూ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
పదునైన అంచుల డిజైన్‌కు శామ్‌సంగ్ వెళ్లడం లేదని సమాచారం. పనితీరు విషయానికి వస్తే.. Galaxy S27 Ultraలో మరింత శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో Snapdragon 8 Elite Gen 6 Pro, మరికొన్ని మార్కెట్లలో Exynos 2700 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.