
Paracetamol: శాస్త్రవేత్తల సంచలనం.. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్యారాసిటమాల్ తయారీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్లాస్టిక్ వ్యర్థాలను నొప్పినివారక మందులుగా మార్చే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈకోలి (E coli) అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ప్లాస్టిక్ సీసాల నుంచి ప్యారాసిటమాల్ (Paracetamol) తయారు చేయగలనని ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నూనె నుంచి ప్యారాసిటమాల్ ఉత్పత్తి "ప్యారాసిటమాల్ ఇప్పటివరకు నూనె నుంచి ఉత్పత్తి అవుతుందని చాలామందికి తెలియకపోవచ్చు. రసాయన శాస్త్రాన్ని జీవశాస్త్రంతో మిళితం చేసే ఈ విధానం ప్యారాసిటమాల్‌ను శుభ్రమయిన, స్థిరత ఉన్న రీతిలో ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కూడా సాధ్యమవుతుందని పరిశోధన ప్రధాన రచయిత ప్రొఫెసర్ స్టీఫెన్ వాలెస్ తెలిపారు.
Details
కొత్త రసాయనిక క్రియ 'లోసెన్ రీయరేంజ్'
నేచర్ కెమిస్ట్రీ పత్రికలో ప్రచురితమైన నివేదికలో శాస్త్రవేత్తలు 'లోసెన్ రీయరేంజ్' అనే రసాయనిక ప్రతిచర్యని జీవకణాల మధ్య కూడా అమలు చేయవచ్చని కనుగొన్నారు. సాధారణంగా రసాయన ప్రయోగశాలల్లో మాత్రమే జరిగే ఈ క్రియ జీవకణాల మధ్య స్వయంచాలకంగా జరగడమే కాకుండా, ఈకోలి కణాల లోపల ఉన్న ఫాస్ఫేట్ మూలకంతో చేర్చినట్టు గుర్తించారు. ప్యారాసిటమాల్ ఉత్పత్తి విధానం ఆహార ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే పాలిథీలిన్ టెరెఫ్తాలేట్ ని రసాయన పద్ధతుల ద్వారా కొత్త పదార్థంగా మార్చారు. దీనిని ఈకోలి బ్యాక్టీరియాతో మిళితం చేయగానే 'పాబా' అనే రసాయన పదార్థం ఏర్పడింది. 'పాబా' అనేది బ్యాక్టీరియాకు డీఎన్‌ఏ ఉత్పత్తికి ముఖ్యమైన రసాయనిక పదార్థం.
Details
24 గంటల్లో 92 శాతం ప్యారాసిటమాల్ ఉత్పత్తి
ఈ విధానంలో ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకుతో 24 గంటల్లోనే ప్యారాసిటమాల్ ఉత్పత్తి చేయగలిగారు. ఉత్పత్తి సామర్థ్యం 92 శాతానికి చేరుకోవడం విశేషం. ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించే మార్గాన్ని ఈ పద్ధతి అందిస్తుంది. రసాయన శాస్త్రం, జీవశాస్త్రాన్ని కలిపే ఈ విధానం ప్యారాసిటమాల్ ఉత్పత్తిని ఇంతకుముందెప్పుడూ సాధ్యం కాని స్థాయికి చేర్చిందని ప్రొఫెసర్ వాలెస్ అన్నారు. తదుపరి పరిశోధనలు అవసరం పెద్దస్థాయిలో ప్యారాసిటమాల్ ఉత్పత్తి చేయాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్యారాసిటమాల్ ఉత్పత్తి చేయగలగడం రసాయనశాస్త్రం, జీవశాస్త్రం రంగాల్లోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ విప్లవాత్మకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.