LOADING...
iPhone 18 Pro: ఐఫోన్‌ 18 ప్రోలో సంచలన ఫీచర్లు.. ఎలాన్‌ మస్క్‌ కంపెనీతో ఆపిల్‌ జట్టు!
ఐఫోన్‌ 18 ప్రోలో సంచలన ఫీచర్లు.. ఎలాన్‌ మస్క్‌ కంపెనీతో ఆపిల్‌ జట్టు!

iPhone 18 Pro: ఐఫోన్‌ 18 ప్రోలో సంచలన ఫీచర్లు.. ఎలాన్‌ మస్క్‌ కంపెనీతో ఆపిల్‌ జట్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఫోన్‌ ప్రేమికులకు మరోసారి ఆపిల్‌ నుంచి సూపర్‌ అప్‌డేట్‌ రానుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఐఫోన్‌ 18 ప్రో మోడల్‌ను ప్రధాన డిజైన్‌ మార్పులు, అప్‌గ్రేడ్‌ ఫీచర్లతో లాంచ్‌ చేయనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్‌లో వేరియబుల్‌ లార్జ్‌ అపెర్చర్‌, సరికొత్త బాడీ డిజైన్‌, 48MP పెరిస్కోప్‌ లెన్స్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. ఈ మోడల్‌ విడుదల సమయంలో ఐఫోన్‌ 18 ప్రో మాక్స్‌, ఐఫోన్‌ ఫోల్డ్‌, ఐఫోన్‌ ఎయిర్‌ 2 లేదా ఐఫోన్‌ ఎయిర్‌ 2026 వంటి ఇతర వెర్షన్లు కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఐఫోన్‌ 18 సిరీస్‌**లో ఫారమ్‌ ఫ్యాక్టర్‌ను కూడా గణనీయంగా అప్‌గ్రేడ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Details

స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కనెక్టివిటీ

ఇక ఐఫోన్‌ 18, ఐఫోన్‌ 18e మోడళ్లను 2026 తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి తీసుకురావాలని ఆపిల్‌ ప్రణాళికలు వేస్తోంది. ప్రత్యేకంగా, ఈ సిరీస్‌లోని ఐఫోన్‌ 18 ప్రో వేరియంట్‌ పెద్ద టెక్‌ ఇన్నోవేషన్‌గా నిలవనుంది. దీనిలో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండనుందని వార్తలొస్తున్నాయి. ఈ ఫీచర్‌ను అందించేందుకు ఆపిల్‌ సంస్థ, ఎలాన్‌ మస్క్‌ యాజమాన్యంలోని స్పేస్‌ఎక్స్‌ కంపెనీతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, డిజైన్‌, కెమెరా‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వంటి విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్‌ 18 ప్రో ఆపిల్‌ ఫోన్‌ లైన్‌ప్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.