Page Loader
iPhone 16: యాపిల్ 16 ఈవెంట్‌లో పాల్గొన్న సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ఆసక్తికరమైన సంభాషణ 
యాపిల్ 16 ఈవెంట్‌లో పాల్గొన్న సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ఆసక్తికరమైన సంభాషణ

iPhone 16: యాపిల్ 16 ఈవెంట్‌లో పాల్గొన్న సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ఆసక్తికరమైన సంభాషణ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖరీదైన ఫోన్స్‌లో ఒకటైన ఆపిల్ సంస్థ ఈ మధ్య కొత్త మోడల్‌ని మార్కెట్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం అమెరికాలో జరిగిన యాపిల్ 16 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ కార్యక్రమం టెక్ ప్రపంచాన్ని విశేషంగా ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో పలు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో భారతీయ నటులు హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరీ హాజరయ్యారు. అదితి రావు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రెండు రోజులు సమయాన్ని కేటాయించారు. యాపిల్ కంపెనీ అధినేత టిమ్ కుక్‌తో కలిసినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Details

 లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది

యాపిల్ 16 ఫోన్ల లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడం తన జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచిందన్నారు. టిమ్ కుక్‌ ఎంతో మంచితనంతో, దయతో తమతో కొద్దిసేపు గడిపారని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అమెరికా, కాలిఫోర్నియాలోని కపర్టినోలోని యాపిల్ పార్క్‌లో 'ఇట్స్ గ్లో టైమ్' అనే కార్యక్రమంలో యాపిల్ 16 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఈ కొత్త ఫోన్లు ఏ 18 బయోనిక్ చిప్, యాపిల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ వంటి ఆధునిక సాంకేతికతలను అందిస్తాయి.

Details

యాపిల్ వాచ్ 10 సిరీస్, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్

ఐఫోన్ 16లో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్, కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్ వంటి నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఈ నెల 13న ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని, 20వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయని యాపిల్ వెల్లడించింది. ఈ ఫోన్లతో పాటు, యాపిల్ వాచ్ 10 సిరీస్, ఎయిర్‌పాడ్స్ 4ను కూడా యాపిల్ లాంచ్ చేసింది.