Sony WF-1000XM6: WF-1000XM6 ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసిన సోనీ.. ధర, ఫీచర్లలో భారీ అప్‌గ్రేడ్
ఈ వార్తాకథనం ఏంటి
సోనీ సంస్థ ఎట్టకేలకు WF-1000XM6 ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా లీకులు,ముందస్తు వివరాలు వినిపించినప్పటికీ, ఇప్పుడు కంపెనీ స్వయంగా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వెల్లడించింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్ బ్లాక్, ప్లాటినం సిల్వర్ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ధరను 329.99 డాలర్లుగా నిర్ణయించగా, ఇది గత మోడల్ WF-1000XM5 ధరతో పోలిస్తే సుమారు 10 శాతం ఎక్కువ. నాయిస్ క్యాన్సిలేషన్‌నే ప్రధాన ఆకర్షణగా తీసుకొచ్చిన సోనీ, ఇందులో కొత్త QN3e నాయిస్ క్యాన్సిలింగ్ ప్రాసెసర్‌ను ఉపయోగించింది. ఇది పాత మోడల్‌లో ఉన్న ప్రాసెసర్ కంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
వివరాలు
మెరుగుపడిన నాయిస్ క్యాన్సిలేషన్
అంతేకాదు, ఒక్కో ఇయర్‌బడ్ లో ఎనిమిది మైక్రోఫోన్లు ఉండటం వల్ల బయటి శబ్దాన్ని మరింత సమర్థంగా అడ్డుకుంటాయని సమాచారం. రివ్యూల ప్రకారం,బయటి శబ్దం దాదాపు పూర్తిగా తగ్గిపోయే స్థాయిలో నాయిస్ క్యాన్సిలేషన్ మెరుగుపడిందని తెలుస్తోంది. సౌండ్ క్వాలిటీలోనూ అప్‌గ్రేడ్ చేశారు.కొత్త డ్రైవర్‌తో పాటు మెరుగైన DAC,యాంప్లిఫయర్ వాడటం వల్ల శబ్దం మరింత క్లియర్‌గా,డీటెయిల్డ్‌గా వినిపిస్తుందని చెబుతున్నారు.
వివరాలు
బ్యాటరీ 24 గంటల బ్యాకప్
కాల్ క్వాలిటీ కోసం బీమ్‌ఫార్మింగ్ మైక్రోఫోన్లు, బోన్ కండక్షన్ సెన్సర్,AI నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని కలిపి ఉపయోగించడం వల్ల బయట శబ్దం ఎక్కువగా ఉన్నా మీ వాయిస్ స్పష్టంగా వినిపిస్తుందని సోనీ తెలిపింది. బ్యాటరీ విషయానికి వస్తే, మొత్తం 24 గంటల వరకూ బ్యాకప్ వస్తుందని, ఇందులో ఇయర్‌బడ్స్‌తో 8 గంటలు, కేస్‌తో మరో 16 గంటలు ఉపయోగించవచ్చని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండగా, కేవలం ఐదు నిమిషాల ఛార్జ్‌తో గంట పాటు వినే అవకాశం కల్పించిందని వివరించింది.