Page Loader
Shubhanshu shukla: హృతిక్‌ మూవీ పాట వింటూ వ్యోమనౌకలోకి శుభాంశు శుక్లా
హృతిక్‌ మూవీ పాట వింటూ వ్యోమనౌకలోకి శుభాంశు శుక్లా

Shubhanshu shukla: హృతిక్‌ మూవీ పాట వింటూ వ్యోమనౌకలోకి శుభాంశు శుక్లా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:01 గంటలకు ఫాల్కన్-9 రాకెట్‌ ద్వారా శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) వైపు బయలుదేరనుంది. వ్యోమనౌకలోకి ప్రవేశించే ముందు శుభాంశు శుక్లా భారతీయతని ప్రతిబింబిస్తూ ఒక ప్రత్యేక సందర్భాన్ని సృష్టించారు. హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' సినిమాలోని 'వందేమాతరం' పాటను వింటూ ఆయన వ్యోమనౌకలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోని స్పేస్‌ ఎక్స్‌ స్వయంగా విడుదల చేసి, అంతరిక్షయాత్రకు శుభాంశుకు శుభాకాంక్షలు తెలిపింది.