Loading...
suno ai: మీ మాటలకు సంగీతం జోడించే ఏఐ టూల్.. సునో కొత్త ఫీచర్
మీ మాటలకు సంగీతం జోడించే ఏఐ టూల్.. సునో కొత్త ఫీచర్

suno ai: మీ మాటలకు సంగీతం జోడించే ఏఐ టూల్.. సునో కొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ మ్యూజిక్ యాప్ సునో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు తాము రాసుకున్న పద్యాలు, ప్రసంగాలకు సరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను సులభంగా జోడించుకోవచ్చు. ఏఐ సాయంతో పాటలను రూపొందించే ప్లాట్‌ఫామ్‌గా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సునో.. ఇప్పుడు యూజర్ల మాటలకు కూడా వినసొంపైన సంగీతాన్ని జోడించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. "మీరే స్వయంగా రాసుకున్న పద్యానికి అందమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను జోడించి మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు" అని సునో సహవ్యవస్థాపకుడు మైకీ షుల్మన్ తెలిపారు. క్రియేటర్లు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ రూపొందించాలన్నా అందుకు సునోనే గమ్యస్థానంగా మారాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

వివరాలు 

5బిలియన్ డాలర్లు దాటిన సునో మార్కెట్ విలువ 

సంగీతంపై ఎలాంటి శిక్షణ లేని సాధారణ వ్యక్తులు సైతం తమ ఆలోచనలను సునో ద్వారా పాటలుగా మార్చుకోవచ్చు.

మనసులో ఉన్న మాటను చెప్పడం లేదా రాయడం ద్వారా ఏఐ సాయంతో కొత్త పాటలను రూపొందించే అవకాశం ఉండటంతో ఈ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతోంది.

ఇప్పటికే సునో మార్కెట్ విలువ 5బిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం.

అయితే సునోకు కాపీరైట్ అంశాలు కూడా సవాలుగా మారాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను ఉపయోగించి తమ ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేసిందంటూ పలు సంగీతసంస్థలు సునోపై న్యాయపరమైన చర్యలు చేపట్టాయి.

వార్నర్ మ్యూజిక్, యూనివర్సల్ గ్రూప్ ఎన్‌వీ,సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ వ్యవహారంలో కేసులు దాఖలు చేశాయి.

వివరాలు 

వార్నర్ మ్యూజిక్‌తో భాగ్యస్వామ్యం 

వీటిలో వార్నర్ మ్యూజిక్‌తో ఉన్న వివాదాన్ని సునో పరిష్కరించుకుంది. అనంతరం ఆ సంస్థతో భాగస్వామ్యాన్ని కూడా ఏర్పరుచుకుంది.

యూనివర్సల్ గ్రూప్ ఎన్‌వీ, సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉన్న న్యాయపరమైన వివాదాలు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు భవిష్యత్తులో మ్యూజిక్ రంగం ఏఐ టెక్నాలజీని విస్తృతంగా స్వీకరిస్తుందని షుల్మన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

సంగీత సృష్టి నుంచి ఇతర క్రియేటర్ ఎంటర్‌టైన్‌మెంట్ పనుల వరకు ఏఐ వినియోగం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT