
ట్విట్టర్ సబ్‌స్ర్కైబర్లకు సూపర్ న్యూస్.. ఇకపై 25వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ సీఈఓగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ట్విట్టర్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఉద్యోగులను తొలగించడం, ట్విట్టర్ లోగోను మార్చడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నాడు.
అదే విధంగా బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేశారు. తాజాగా ట్విట్టర్ మరో సరికొత్త ఫీచర్ ను తీసుకురానున్నారు.
బ్లూటిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా ట్వీట్ అక్షరాల పరిమితిని పెంచారు.
10వేల క్యారెక్టర్లు ఉన్న ట్వీట్ నోట్ పరిమితిని 25వేలకు పెంచుతూ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు ట్వీట్ ఇంజనీరు ప్రాచీ పొద్దార్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Details
ట్విట్టర్ లో 60 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను పంపే అవకాశం
బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ సబ్‌స్క్రైబర్లు ఇకపై 25వేల అక్షరాల వరకు ట్విట్ కంపోజ్‌తో పాటు వినియోగదారులను చేసిన ట్విట్ ను 30 నిమిషాల్లోపు 5 సార్లు సవరించుకోనే అవకాశాన్ని కల్పించారు.
వినియోగదారులు గరిష్టంగా 2GB ఫైల్ పరిమాణంతో 60 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేయోచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో ట్విట్ అక్షరాల పరిమితిని 4 నుంచి 10వేలకు పెంచిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు, సబ్‌స్క్రైబర్లకు అదనపు ఫీచర్లు అందించేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ప్రాచీ తెలిపారు. Twitter బ్లూటిక్ వార్షిక ప్లాన్ ధర రూ. 9,400 ఉండనుంది.