Page Loader
గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి' 
గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి'

గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి' 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2023
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇక నుంచి వినియోగదారులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ప్రకటించారు. అయితే దీనికి సబ్‌స్క్రిప్షన్‌ పొందిన వినియోగదారులు మాత్రమే అర్హులని ఆయన చెప్పారు. లాంగ్‌ఫార్మ్ టెక్స్ట్ నుంచి గంటల నిడివి గల వీడియో వరకు ట్విట్టర్ వినియోగదారులు ఆదాయాన్నిపొందడానికి అర్హులని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ తన సైట్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.

ట్విట్టర్

భవిష్యత్‌లో మంచి ఆదాయవనరుగా ట్విట్టర్

మొదటి 12 నెలలు పాటు సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి వచ్చిన డబ్బుల్లో తాము ఏమీ తీసుకోబోమని మస్క్ స్పష్టం చేశారు. యాప్ స్టోర్ ఫీజులను లెక్కించిన వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్ రాబడిలో కనీసం 70శాతం వరకు పొందవచ్చని చెప్పారు అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోనే అన్ని దేశాలకు విస్తరిస్తామని మస్క్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ట్విట్టర్‌ను మస్క్ మంచి ఆదాయ వనరుగా మార్చే అవకాశం ఉంది.