2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు
2022 ఎన్నో ఉత్పత్తులకు మైలురాయి మాత్రమే కాదు కొన్ని ఉత్పత్తులకు చివరి సంవత్సరం కూడా. అవేంటో తెలుసుకుందాం Ipod: 2001 లో మొదలైన ఈ ఉత్పత్తి ఐఫోన్ 4 లా ఉంటుంది, చాలా సంవత్సరాల నుండి అప్డేట్ కాకపోవడంతో పాటు స్పాటిఫై వంటి వేదికలు రాకతో దీని వైపు కన్నెత్తి చూసేవారు కరువయ్యారు. నిజానికి ఆపిల్ ఈ ఉత్పత్తిని నిలిపేయడానికి చాలా సంవత్సరాలు ఆగిందనే చెప్పాలి. గూగుల్ స్టేడియా: గేమింగ్ కోసం 2019లో మొదలుపెట్టిన ఈ ఉత్పత్తికి సరైన ఆదరణ లభించలేదు. ఇది అందించే చాలా గేమ్స్ ను వేరే వాటిల్లో అందుబాటులో ఉండటం వలన వినియోగదారులను పెద్దగా ఆకర్షించలేదు. 2022 సెప్టెంబర్ లో ఉత్పత్తి నిలిపేస్తున్నామని గూగుల్ ప్రకటించింది.
ఇకపై బ్లాక్ బెర్రీ సాఫ్ట్వేర్ కూడా పనిచేయదు
బ్లాక్ బెర్రీ: నిజానికి ఈ ఫోన్లు కు డిమాండ్ ఎప్పుడో తగ్గిపోయింది కానీ ఈ సంవత్సరం ఆ సంస్థ ఆ బ్లాక్ బెర్రీ పరికరాలకు సాఫ్ట్వేర్ అందించే సర్వర్లను షిట్ డౌన్ చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆపిల్ వాచ్ సిరీస్ 3: బడ్జెట్ అనుకూలమైన వాచ్ అనే పేరు తప్ప ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు డిజైన్ తో లేని ఈ వాచ్ అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆ సంస్థ వీటి అమ్మకాలని నిలిపివేసింది. అమెజాన్ గ్లో: అమెజాన్ సంస్థ ఫెయిల్ అయిన ఉత్పత్తుల్లో ఇదొకటి. పిల్లలకు వీడియో కాలింగ్ మరెన్నో ఫీచర్లతో మొదలుపెట్టినా పెద్దగా వినియోగదారులను ఆకట్టుకోలేదు. లాంచ్ చేసిన 6 నెలలకే అమెజాన్ ఈ ఉత్పత్తిని వెనక్కి తీసుకుంది.