Google 67 Search Trick: గూగుల్‌లో 67 టైప్ చేస్తే స్క్రీన్ షేక్… సేఫ్ ఫన్ ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో గూగుల్ మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. చిన్న సమాచారం కావాలన్నా, పెద్ద విషయంపై వివరాలు తెలుసుకోవాలన్నా ఎక్కువ మంది ముందుగా ఆశ్రయించేది గూగుల్ సెర్చ్‌నే. అయితే, గూగుల్‌లో యూజర్లను ఆశ్చర్యపరచే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు, సరదా ట్రిక్స్ ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో ఇప్పుడు '67'నంబర్ ఒకటి. ఇటీవల ఈ నంబర్ కోసం పెద్ద సంఖ్యలో యూజర్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ 67 అంటే ఏమిటి? దాన్ని సెర్చ్ చేస్తే ఏమవుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి,గూగుల్ సెర్చ్ బార్‌లో 67 లేదా 6-7 అని టైప్ చేసి సెర్చ్ చేస్తే, వెంటనే ఒక వింత అనుభవం ఎదురవుతుంది.
వివరాలు
స్క్రీన్ ఒక్కసారిగా కొన్ని సెకన్ల పాటు షేక్
సెర్చ్ చేసిన క్షణంలోనే మీ కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా కొన్ని సెకన్ల పాటు షేక్ అవుతుంది. మొదట ఇది చూసినప్పుడు ఎవరికైనా షాక్ తగలడం సహజమే. కానీ క్షణం గడిచిన తర్వాత ఇది ఒక సరదా ట్రిక్ అని అర్థమవుతుంది. ఈ స్క్రీన్ షేకింగ్ అనేది ఏదైనా లోపం వల్ల కాదు, గూగుల్ ఉద్దేశపూర్వకంగా అందించిన వినోదాత్మక ఫీచర్ మాత్రమే. ముఖ్యంగా, ఇది కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లకే కాదు, స్మార్ట్‌ఫోన్‌లలో కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఈ ట్రిక్‌ని మీరు కూడా సులభంగా ప్రయత్నించవచ్చు. ముందుగా మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ ఓపెన్ చేయాలి.
వివరాలు
వినోదం కోసం ఈ ఫీచర్
తర్వాత సెర్చ్ బార్‌లో 67 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. అంతే... స్క్రీన్ కొన్ని సెకన్ల పాటు కంపించేలా షేక్ అవడం మీకు కనిపిస్తుంది. ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇది సురక్షితమేనా?అనే సందేహం రావొచ్చు. కానీ ఈ ఫీచర్ పూర్తిగా సేఫ్.ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది. కొన్ని సెకన్ల తర్వాత స్క్రీన్ ఆటోమేటిక్‌గా మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఒకవేళ ఏదైనా కారణంతో షేకింగ్ ఆగకపోతే, ఆ పేజీని రిఫ్రెష్ చేయడం లేదా బ్యాక్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. మొత్తానికి,గూగుల్‌లో దాగి ఉన్న ఈ చిన్న సరదా ట్రిక్ యూజర్లకు కాసేపు వినోదాన్ని అందించేందుకే రూపొందించబడిందని చెప్పొచ్చు.