
Robot: కూరగాయలను తరగడానికి, వంట పనులకు మర మనిషి
ఈ వార్తాకథనం ఏంటి
వంట పనులకు, కూరగాయాలను తరగడానికి పనిమనిషి రాలేదని బెంగపడక్కర్లేదు.
ఎందుకంటే ఇలాంటి పనుల్లో చేదోడువాదోడుగా ఉండే రోబోలు వచ్చేస్తున్నాయి.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు కూరగాయలు కత్తిరించడానికి, వంట గది పనులను చేయడానికి ఓ కొత్త రోబోను ఆవిష్కరించారు.
ఇటీవల ఆ సంస్థ ప్రదర్శించిన ఓ వీడియోలో రోబో ఒక చేతిలో కురగాయలను పట్టుకొని, మరొక చేతిలో పొట్లకాయలను తరుగుతున్నట్లు చూపించారు.
Details
సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం
మానవులు కూరగాయలను ఎలా కత్తిరిస్తారో అదే విధంగా రోబో కూరగాయలను కట్ చేసింది.
పుచ్చకాయ, చిలగడదుంప, గుమ్మడికాయను ఉపయోగించి పరిశోధకులు ఈ ప్రక్రియను ప్రదర్శించారు.
ఇక రిఓరియంటేషన్ కంట్రోలర్‌ను నేర్చుకోవడం కోసం మేము ఒక సాధారణ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నాం. అది తదుపరి పీలింగ్ పనిని సులభతరం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఇందులో అదనపు దశలు ఉన్నాయని, కానీ రోబోట్ కోసం ఇది సవాలుగా మారుతుందని MIT అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్కిత్ అగర్వాల్ అన్నారు.