NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Chandrayaan-4: రెండు దశల్లో 'చంద్రయాన్-4' ప్రయోగం 
    తదుపరి వార్తా కథనం
    Chandrayaan-4: రెండు దశల్లో 'చంద్రయాన్-4' ప్రయోగం 
    Chandrayaan-4: రెండు దశల్లో 'చంద్రయాన్-4' ప్రయోగం

    Chandrayaan-4: రెండు దశల్లో 'చంద్రయాన్-4' ప్రయోగం 

    వ్రాసిన వారు Stalin
    Mar 06, 2024
    03:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రయాన్-3 మిషన్ చారిత్రాత్మక విజయం తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు 'చంద్రయాన్-4' కోసం సిద్ధమవుతోంది.

    చంద్రయాన్-4 మిషన్‌ను గత ప్రయోగాల్లా కాకుండా.. సరికొత్తగా ఇస్రో నిర్వహించనుంది.

    చంద్రయాన్-4 మిషన్ చంద్రుడిపైకి వెళ్లి అక్కడి నుంచి భూమికి కూడా రానుంది. నిజానికి చంద్రయాన్-3ని ఒకే దశలో ప్రయోగించారు.

    చంద్రయాన్-4ని రెండు దశల్లో ప్రయోగించనున్నారు. రెండు వేర్వేరు ప్రయోగాల్లో చంద్రయాన్-4 వాహనాన్ని తీసుకువెళతాయి.

    ఇది చంద్రునిపై దిగడమే కాకుండా చంద్రుని ఉపరితలం నుంచి భారతదేశానికి రాళ్లు, మట్టిని తిరిగి తీసుకువస్తుంది.

    చంద్రయాన్-4ను తొలి దశలో భూమి నుంచి ప్రయోగించనున్నారు. దీని తర్వాత అది చంద్రునిపై ల్యాండ్ అవుతుంది.

    రెండో దశలో చంద్రునిపై అన్ని పనులను పూర్తి చేసి.. భూమికి నమూనాలను తీసుకొస్తుంది.

    చంద్రయాన్

    చంద్రయాన్-4లో ఐదు మాడ్యూళ్లు

    మొదటి సారి ప్రయోగించే సమయంలో, చంద్రయాన్-4 మొత్తం బరువు 5200 కిలోలు కాగా.. చంద్రుడి నుంచి భూమి వైపు ప్రయోగించినప్పుడు, దాని బరువు 1527 కిలోల బరువు ఉండనుంది.

    చంద్రయాన్-4 మిషన్‌లో మరో రెండు అదనపు భాగాలు ఉంటాయి.

    అవి చంద్రుడి నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడం, వాటిని భూమిపై పడవేయడం వంటివి. చంద్రయాన్-4 తనతోపాటు ఐదు మాడ్యూళ్లను మోసుకెళ్లనుంది.

    ఇది ఆరోహణ మాడ్యూల్, డిసెండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, బదిలీ మాడ్యూల్, రీఎంట్రీ మాడ్యూల్ కలిగి ఉంటుంది.

    ప్రతి మాడ్యూల్ ప్రత్యేక్ష ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ వంటి మూడు ప్రధాన భాగాలను చంద్రయాన్-3 కలిగి ఉన్న విషయం తెలిసిందే.

    చంద్రయాన్

    ఐదు మాడ్యూళ్లు చేసే పనులు ఇవే..

    1. ప్రొపల్షన్ మాడ్యూల్: ఇది చంద్రయాన్-3ని పోలి ఉంటుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్-4ని విడిపోయే ముందు చంద్ర కక్ష్యలోకి నడిపిస్తుంది.

    2. డిసెండర్ మాడ్యూల్: ఈ మాడ్యూల్ చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ లాగా చంద్రునిపై ల్యాండ్ అవుతుంది.

    3. అసెండర్ మాడ్యూల్: అన్ని నమూనాలను సేకరించిన తర్వాత అసెండర్ మాడ్యూల్ ల్యాండర్ నుంచి నిష్క్రమించి భూమికి తిరిగి రావడం ప్రారంభిస్తుంది.

    4. ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్: ఇది చంద్ర కక్ష్య నుంచి బయటకు తీయడానికి సాయపడుతుంది. రాళ్లు, మట్టి నమూనాలతో పాటు క్యాప్సూల్ విడిపోయే ముందు ఇది భూమికి తిరిగి వస్తుంది.

    5. రీ-ఎంట్రీ మాడ్యూల్: ఇది చంద్రుడి మట్టిని మోసే గుళిక. భూమిపై చంద్ర నమూనాలను విజయవంతంగా ల్యాండ్ చేయడానికి ఉపయోగపుడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    తాజా వార్తలు
    ఇస్రో

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చంద్రయాన్-3

    అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు భారతదేశం
    చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ భారతదేశం
    చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇవే.. ఇస్రో
    చంద్రయాన్-3 బయోపిక్ చేయాలంటూ బాలీవుడ్ హీరోకు పెరుగుతున్న రిక్వెస్టులు  సినిమా

    తాజా వార్తలు

    Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్ ఫ్యామిలీ స్టార్
    Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి పాకిస్థాన్
    బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..  ఉత్తర్‌ప్రదేశ్

    ఇస్రో

    ISRO: రేపు ఉదయం 11. 50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్ ఆదిత్య-ఎల్1
    Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం ఆదిత్య-ఎల్1
    నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..   ఆదిత్య-ఎల్1
    ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్‌-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు ఆదిత్య-ఎల్1
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025