Page Loader
Android 14 లో అద్భుతమైన ఫీచర్లు ఇవే
Android 14 లో సరికొత్త ఫీచర్స్

Android 14 లో అద్భుతమైన ఫీచర్లు ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

Google ఇప్పుడు సాధారణ వినియోగదారుల కోసం Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బీటా వెర్షన్ ను విడుదల చేసింది. Android 13 విడుదలైన తర్వాత Google ఇప్పుడు Android 14 లో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ను తీసుకొచ్చింది. రాబోయే రెండు నెలల పాటు బీటా వెర్షన్ తో పరీక్షించబడుతుంది. Android 14 మొదటి బీటా వెర్షన్ నావిగేషన్ బార్ ఫీచర్‌ను జోడించింది. సెట్టింగ్‌లు > సిస్టమ్ > డెవలపర్ ఎంపికలు > పారదర్శక నావిగేషన్ బార్ కింద అందుబాటులో ఉండనున్నాయి. దీంతో వినియోగదారులు నావిగేషన్ బార్ యొక్క రంగును డిఫాల్ట్‌గా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్

Android 14 సౌకర్యాలివే

Android 14 బీటా అప్‌డేట్ ద్వారా కావాల్సిన భాషను ఎంచుకొని, ఉఫయోగించే సదుపాయాన్ని కూడా కల్పించారు. రాబోయే బీటా బిల్డ్‌లలో గూగుల్ ఆండ్రాయిడ్ 14కి మరిన్ని ఫీచర్లను జోడించనున్నారు. ప్రస్తుతం Google Pixel 7 Pro, Pixel 7, Pixel 6 Pro, Pixel 6, 6a, 5, 5a, 4a మోడల్‌లో Androied 14 ని డౌన్ లోడ్ చేసి, అమలు చేయనున్నారు. ఈ ఆండ్రాయిడ్ అప్‌డేట్ వెర్షన్‌లో Google ఇప్పటికే ఉన్న గ్రాఫిక్స్, సెక్యూరిటీ ఫీచర్లు, వ్యక్తిగతంగా మార్చాలనుకుంటున్న ఫీచర్లను మెరుగుపరచనుంది.