Smart Phones: అక్టోబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న స్టార్మ్ ఫోన్స్ ఇవే.. ఫీచర్స్ అదుర్స్!
మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు కొదువ లేదు. రకరకాల మోడళ్లు, అబ్బుపరిచే ఫీచర్లు, ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్‌లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌తో సెప్టెంబర్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కళకళలాడిపోయింది. ఇక అక్టోబర్‌లో కూడా అనేక స్మార్ట్ ఫోన్ ల లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. వివో వీ29, వివో వీ29 ప్రో అక్టోబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. ఇందులో 6.78 ఇంచ్ డిస్ ప్లే స్క్రీన్, పవర్ ఫుల్ ఐఎంఎక్స్ 663 సెన్సార్ కెమెరా ఉండనుంది. ఇక అక్టోబర్ 4న గూగుల్ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మోడల్స్ లాంచ్ కానున్నాయి. వీటిలో క్రేజీ ఫీచర్స్ ఉండనున్నాయి.
ఒప్పొ ఏ18 పై భారీ అంచనాలు
గత కొంతకాలంగా వార్లలో నిలిచిన వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డెబుల్ స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్‌లో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇది అక్టోబర్ తొలి వారంలో ఈ మోడల్ లాంచ్ అవుతుంది. అక్టోబర్ నెల మధ్యలో సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్44 లాంచ్ అవ్వొచ్చు. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతమని లీక్స్ సూచిస్తున్నాయి. ఒప్పొ ఏ 18 లో ఇప్పటికే యూఏఈలో లాంచ్ అయ్యింది. ఇండియాలో కూడా అక్టోబర్‌లో లాంచ్ కానుంది. షావోమీ 13 టీ సిరీస్‌లో షావోమీ నుంచి 13 టీ, 13 టీ ప్రో గ్యాడ్జెట్స్ లాంచ్ అవ్వాల్సి ఉంది. వీటి ధర వివరాలు తెలియాల్సి ఉంది.