Loading...
John Ternus: పదవి మారినా ఆపిల్‌పై ప్రేమ ఎప్పటికీ తగ్గదు: టిమ్‌ కుక్‌ భావోద్వేగం
పదవి మారినా ఆపిల్‌పై ప్రేమ ఎప్పటికీ తగ్గదు: టిమ్‌ కుక్‌ భావోద్వేగం

John Ternus: పదవి మారినా ఆపిల్‌పై ప్రేమ ఎప్పటికీ తగ్గదు: టిమ్‌ కుక్‌ భావోద్వేగం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ దిగ్గజం ఆపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్‌ కుక్‌ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జాన్‌ టెర్నస్‌ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2011 ఆగస్టులో ఆపిల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్‌ కుక్‌.. సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగంగా స్పందించారు.''రేపటి నుంచి నా పదవి మారవచ్చు.కానీ ఆపిల్‌ సంస్థపై నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. ఇన్నాళ్లూ నాకు నిరంతరం స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.ఇకపై చేపట్టబోయే బాధ్యతలపై ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్నాను''అని కుక్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు.

వివరాలు 

4.5 ట్రిలియన్‌ డాలర్లకు మార్కెట్‌ విలువ

అయితే సీఈవో పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన టిమ్‌ కుక్‌ ఆపిల్‌కు పూర్తిగా దూరం కావడం లేదు.

సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఆయన కొనసాగనున్నారు. ఆపిల్‌కు సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక అంశాల్లో తన అనుభవంతో సంస్థకు సహకరించనున్నారు.

కుక్‌ సారథ్యంలో ఆపిల్‌ మార్కెట్‌ విలువ కూడా భారీగా పెరిగింది. 2011లో సుమారు 350 బిలియన్‌ డాలర్లుగా ఉన్న సంస్థ మార్కెట్‌ విలువ.. ప్రస్తుతం ఏకంగా 4.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది.

ఈ పెరుగుదలలో కుక్‌ నాయకత్వం కీలక పాత్ర పోషించింది.

వివరాలు 

కొత్త సీఈవోగా జాన్‌ టెర్నస్

ఆపిల్‌ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జాన్‌ టెర్నస్‌ 2001లో సంస్థలో చేరారు.

ఇప్పటివరకు ఆయన హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

ఆపిల్‌ కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో టెర్నస్‌కి విస్తృత అనుభవం ఉంది.

ముఖ్యంగా ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌, ఎయిర్‌పాడ్స్‌ వంటి యాపిల్‌ ఉత్పత్తుల అభివృద్ధిలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇప్పుడు సంస్థ సీఈవోగా కొత్త బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబరు 9న నిర్వహించనున్న ఆపిల్‌ కార్యక్రమంలో జాన్‌ టెర్నస్‌ తొలిసారి సీఈవో హోదాలో వేదికపై కనిపించే అవకాశం ఉంది.

దీంతో ఆయన నాయకత్వంలో ఆపిల్‌ ప్రయాణం ఎలా సాగుతుందన్నదానిపై టెక్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టిమ్‌ కుక్‌ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT