'Time traveller from 2118': 2118 నుంచి వచ్చానన్న టైమ్ ట్రావెలర్.. . పలు రహస్యాలు వెల్లడి?
ఈ వార్తాకథనం ఏంటి
2118వ సంవత్సరం నుంచి తాను తిరిగి వచ్చానంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ 1980లలో రహస్యంగా తనను 2118వ సంవత్సరానికి పంపిందని అలెగ్జాండర్ స్మిత్ అనే వ్యక్తి సంచలన వాదన చేశాడు. ఈ వ్యాఖ్యలు నిజమా కాదా అన్న విషయంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినా, అతను వెల్లడించిన అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'అపెక్స్ టీవీ' అనే యూట్యూబ్ ఛానెల్‌లో లాటెక్స్ మాస్క్ ధరించి కనిపించిన స్మిత్, ప్రజలకు తెలియకుండా దాచిపెట్టిన రహస్య సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేయడమే తన ఉద్దేశమని తెలిపాడు.
వివరాలు
భవిష్యత్తులో అమెరికా,ఉత్తర కొరియాల మధ్య తీవ్రమైన విభేదాలు
2118 నాటికి ప్రజలు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తూ, ఎగిరే వాహనాలతో కూడిన అత్యాధునిక నగరాల్లో జీవిస్తారని పేర్కొన్నాడు. తన మాటలకు ఆధారంగా 2118సంవత్సరానికి సంబంధించినదని చెప్పిన ఒక ఫోటోను కూడా చూపించాడు. భవిష్యత్తులో అమెరికా,ఉత్తర కొరియాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తి,అవే చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని స్మిత్ పేర్కొన్నాడు. ఆ యుద్ధంలో ఉత్తర కొరియాకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగుతుందని,దీంతో పరస్పరం క్షిపణి దాడులు చోటుచేసుకుంటాయని చెప్పాడు. ఈ ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టం సంభవించినప్పటికీ,అనంతరం దేశాల మధ్య సరిహద్దుల ప్రాధాన్యం తగ్గిపోతుందని,ప్రజలు జీవితం విలువను మరింతగా అర్థం చేసుకుని పరస్పర సహకారంతో జీవించడం ప్రారంభిస్తారని,చివరికి ప్రపంచం శాంతి దిశగా అడుగులు వేస్తుందని అతను వివరించాడు.
వివరాలు
2028 నాటికి టైమ్ ట్రావెల్ సేవలు
సాంకేతిక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని స్మిత్ తెలిపాడు. 2028 నాటికి సాధారణ ప్రజలకు కూడా వాణిజ్యపరంగా టైమ్ ట్రావెల్ సేవలు అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. అదే ఏడాదిలో తెలివైన గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని కూడా పేర్కొన్నాడు. కాల ప్రయాణం సాధ్యమేనా అనే అంశంపై శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అలెగ్జాండర్ స్మిత్ చేసిన ఈ వాదనలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, అతను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటివరకు స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు లేదా అధికారిక ధృవీకరణ లేవు.