సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder
సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది. ఆన్‌లైన్ భద్రత ఇప్పుడు కీలకం అందుకే ఆన్‌లైన్ టెక్నాలజీ సురక్షితమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరిలో సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. Tinder అనే వేదికపై అపరిచితులు కలుస్తారు. అందువల్ల, ప్లాట్‌ఫారమ్‌ను వీలైనంత సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. Tinder విడుదల చేస్తున్న భద్రతా ఫీచర్ 'Block Profile' వినియోగదారులకు ప్రొఫైల్‌లను బ్లాక్ చేయడంలో సహాయపడుతుంది.అవి మళ్లీ రికమెండేడ్ లో కనిపించవు. ఈ ఫీచర్ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Incognito Modeతో మెంబర్స్ వారిని ఎవరు చూడాలో నియంత్రించగలరు
ప్రొఫైల్‌ల ద్వారా స్క్రోల్ చేస్తున్నప్పుడు Tinderలో వారిని ఎవరు చూడచ్చనే దానిపై Incognito Mode వినియోగదారులకు పూర్తి నియంత్రణను ఇస్తుంది. ఈ ఫీచర్ లైక్ లేదా నో ట్యాప్ చేయకుండా ఆపదు, కానీ వినియోగదారులు ఎంచుకున్న వారు మాత్రమే ఇలా చేయగలరు. అయితే, ఈ ఫీచర్ Tinder+, Gold, Premium సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Tinder 'Long Press Reporting'ను కూడా ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులను అభ్యంతరకరమైన సందేశాలు, చిత్రాలను వేగంగా రిపోర్ట్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. అలా చేయడానికి వినియోగదారులు మెసేజ్ ను గట్టిగా నొక్కి పట్టుకోవాలి. గృహ హింస, లైంగిక వేధింపులను అంతం చేసే ప్రచారమైన నో మోర్‌తో కలిసి Tinder ఆరోగ్యకరమైన డేటింగ్ మార్గదర్శకాలను రూపొందిస్తోంది.